అర్జున్ S/O వైజయంతి నుంచి అదిరిపోయే పోస్టర్ రిలీజ్

Arjun Son of Vyjayanthi Team Released Powerful Poster of Kalyan Ram and Vijayashanthi

నందమూరి కళ్యాణ్ రామ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ అర్జున్ S/O వైజయంతి. ఈ చిత్రంలో విజయశాంతి పవర్ ఫుల్ పాత్రలో కనిపిస్తున్నారు. ఈ యాక్షన్-ప్యాక్డ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో ఈ రెండు పాత్రలు మధ్య డైనమిక్స్ కీలకంగా వుండబోతున్నాయి. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించి ఈ చిత్రాన్ని అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌లపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేస్తోంది. తాజాగా శ్రీరామ నవమి శుభ సందర్భంగా మేకర్స్ నిన్న ఈ సినిమా నుంచి కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. కళ్యాణ్ రామ్, విజయశాంతి ఇద్దరినీ డైనమిక్ గా ప్రజెంట్ చేసిన ఈ పోస్టర్ అదిరిపోయింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఈ మూవీ వండర్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందిస్తుందని హామీ ఇస్తుంది.

‘అర్జున్ S/O వైజయంతి’ టీజర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఫస్ట్ సింగిల్ నయాల్ది సాంగ్ చార్ట్ బస్టర్ హిట్ అయ్యింది. ప్రస్తుతం సినిమా ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్ లో జరుగుతున్నాయి. శ్రీరామ నవమి సందర్భంగా స్పెషల్ ఇంటర్వ్యూ చేశారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మేకర్స్ తర్వలోనే గ్రాండ్ ఈవెంట్ లో ట్రైలర్ లాంచ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

కాగా ఈ చిత్రంలో సయీ మంజ్రేకర్ కథానాయికగా నటిస్తుండగా.. సోహైల్ ఖాన్ ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. అలాగే సీనియర్ నటుడు శ్రీకాంత్ మేకా, ‘యానిమల్’ ఫేమ్ పృథ్వీవీరాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. బి అజనీష్ లోక్‌నాథ్ సంగీతం సమకూరుస్తుండగా.. రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ, తమ్మిరాజు ఎడిటింగ్, శ్రీకాంత్ విస్సా స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. ఏప్రిల్ 18న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.