గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘పెద్ది’. నేషనల్ అవార్డ్ విన్నర్ ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చి బాబు సానా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ పాన్-ఇండియా స్పెక్టికల్‌ని మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పిస్తున్నారు. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం నుంచి ఇటీవల హీరో రామ్ చరణ్ జన్మదినం సందర్భంగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ హ్యూజ్ బజ్ క్రియేట్ చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్ ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందించారు. రేపు ఈ మూవీ నుంచి గ్లింప్స్ రిలీజ్ చేయనున్నట్టు తెలియజేశారు. శ్రీరామనవమి సందర్భంగా రేపు ఉదయం 11:45 గంటలకి పెద్ది గ్లింప్స్ రిలీజ్ చేయనున్నట్టు వెల్లడించింది చిత్రయూనిట్. ఇక దీనికి సంబంధించి ఇప్పటికే మిక్సింగ్ కూడా పూర్తయింది. కాగా స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని చరణ్ కెరీర్‌లో చిరస్థాయిగా నిలిచిపోయేలా తీస్తున్నాడు డైరెక్టర్ బుచ్చిబాబు.
ఇక ఈ చిత్రంలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా.. కన్నడ మెగాస్టార్ శివ రాజ్ కుమార్ ఓ ముఖ్యమైన పాత్రలో, ఇంకా జగపతి బాబు, దివ్యేందు శర్మ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. అలాగే ఆస్కార్ అవార్డు గ్రహీత ఎఆర్ రెహమాన్ సంగీతం సమకూరుస్తుండగా.. ప్రఖ్యాత సినిమాటోగ్రాఫర్ ఆర్. రత్నవేలు ఐఎస్‌సి డీవోపిగా వర్క్ చేస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటింగ్, ప్రొడక్షన్ డిజైనర్‌గా అవినాష్ కొల్లా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
ఇక పెద్ది చిత్రాన్ని భారీ బడ్జెట్, అత్యాధునిక సాంకేతికత, అద్భుతమైన విజువల్స్, ప్రపంచ స్థాయి నిర్మాణ విలువలతో ఎపిక్ స్కేల్‌లో నిర్మిస్తున్నారు. దీని మ్యాసీవ్ స్కేల్ ఇప్పటికే సంచలనం సృష్టిస్తోంది. కాగా ఈ చిత్రాన్ని విజనరీ వెంకట సతీష్ కిలారు తన ప్రతిష్టాత్మక బ్యానర్ వృద్ధి సినిమాస్‌పై నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో చెర్రీ మరోసారి బిగ్ స్క్రీన్ పై సంచలనం సృష్టించడానికి సిద్ధంగా వున్నాడు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:

























