వార్ 2తో తలపడనున్న కూలీ

The release date of Coolie has been announced

సూపర్ స్టార్ రజినీకాంత్ ,సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కూలీ.ఇందులో కింగ్ నాగార్జున కూడా నటిస్తుండడంతో తమిళ్ తోపాటు తెలుగులోనూ ఈసినిమాపై భారీ అంచనాలు వున్నాయి.షూటింగ్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్లే.ఇక ఈసినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించారు మేకర్స్.ఆగస్టు 14న కూలీ విడుదలకానుంది.అయితే అదే రోజున వార్ 2 కూడా విడుదలకానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హృతిక్ రోషన్ , ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్న ఈసినిమాను అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్నాడు.ఎన్టీఆర్ ఉండడంతో తెలుగులోనూ ఈసినిమాకు భారీ హైప్ వుంది. దాంతో కూలీకి తెలుగులో భారీ పోటీ ఎదురుకానుంది.తమిళంలో మాత్రం వార్ 2 ఎఫెక్ట్ పెద్దగా ఉండకపోవచ్చు.ఇక రజినీకాంత్ బిగ్గెస్ట్ హిట్ జైలర్ కూడా ఆగస్టు నెలలోనే విడుదలైంది.మరి ఆ సెంటిమెంట్ కూలీకి కలిసొస్తుందో చూడాలి.

లోకేష్ మార్క్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈసినిమాలో ఉపేంద్ర ,శృతి హాసన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తుండగా సన్ పిక్చర్స్ నిర్మిస్తుంది. బ్లాక్ బస్టర్ టాక్ వస్తే కూలీ 1000కోట్ల రేస్ లో నిలువనుంది.త్వరలోనే టీజర్ ను రిలీజ్ చేయనున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.