‘ఫలక్‌నుమా దాస్’ చిత్రంతో టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్. ఆయన కెరీర్‌లో మైలురాయిగా నిలిచిపోయిన ఈ సినిమాకి తానే స్వయంగా దర్శకత్వం వహించడం విశేషం. 2019లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ సూపర్ హిట్ అయింది. ఇక ఈ చిత్రంతో విశ్వక్ ‘మాస్ కా దాస్’ అనే పేరుతో పాపులర్ అయ్యాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే ఈ సినిమా ఇప్పుడు మళ్ళీ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. దాదాపు 6 ఏళ్ల తర్వాత మళ్లీ రీరిలీజ్ కాబోతోంది. ఈ మేరకు విషయాన్ని హీరో విశ్వక్ సేన్ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించాడు. ఏప్రిల్ 10న రీ రిలీజ్ చేయనున్నట్టు తెలుపుతూ మూవీ పోస్టర్‌ను షేర్ చేశాడు. సలోని మిశ్రా, హర్షితా గౌర్ హీరోయిన్‌లుగా నటించగా.. ‘పెళ్లి చూపులు’ ఫేమ్ తరుణ్ భాస్కర్ కీలక పాత్రలో నటించాడు.
ఫలక్‌నుమా దాస్ కథ ఏంటంటే..?
హైదరాబాద్ లోని ఫలక్‌నుమా ప్రాంతానికి చెందిన యువకుడు దాస్ (విశ్వక్ సేన్). చిన్నప్పటినుండీ ఆ ఏరియాలో ఉన్న లోకల్ దాదా శంకర్(జీవన్)ను చూసి పెద్దయ్యాక అతడిలా కావాలని ఆశపడుతుంటాడు. ఈ ప్రభావంతో చిన్న వయస్సులోనే తన స్నేహితులతో కలిసి ఓ చిన్న గ్యాంగ్‌ను ఏర్పాటు చేస్తాడు. ఈ గ్యాంగ్‌కు శంకర్ కూడా సహకరిస్తుంటాడు. స్కూల్ రోజుల్లో శంకర్ గ్యాంగ్‌తో కలిసి తిరుగుతూ, జీవితాన్ని సరదాగా గడుపుతాడు.
అయితే కాలేజీలో చేరిన తర్వాత దాస్ ప్రేమలో పడతాడు. అలాగే గొడవలు కూడా ఎక్కువవుతాయి. మరోవైపు శంకర్ ఇదే సమయంలో రవి, రాజు అనే ఇద్దరి చేతిలో హత్యకు గురవుతాడు. దీంతో దాస్ గ్యాంగ్ ఒంటరిదవడంతోపాటు వీరి జీవితంలో సమస్యలు తలెత్తుతాయి. వీటి నుంచి బయటపడేందుకు వీరు కొత్త మార్గాలు వెతుకుతారు.
ఈ క్రమంలో బ్రతుకుదెరువు కోసం ఫలక్‌నుమా ఏరియాలో ఒక మటన్ షాప్‌ను ప్రారంభిస్తారు. దాస్ ఆధ్వర్యంలో ఇది మంచిగా రన్ అవుతుండటంతో అంతకుముందునుంచీ అక్కడ వ్యాపారం చేస్తున్న రవి, రాజుల బిజినెస్ దెబ్బతింటుంది. దీంతో కక్ష పెంచుకున్న వీరు దాస్ గ్యాంగ్‌తో గొడవకు దిగుతారు. అయితే ఈ ఘర్షణలో ఏం జరిగింది? దాస్‌ని పోలీసులు ఎందుకు వెతుకుతుంటారు? టింక్ అనే వ్యక్తి వలన దాస్ లైఫ్‌లో జరిగిన పరిస్థితులేంటి? అనేది మిగిలిన కథ.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























