ట్యాలెంటెడ్ హీరో శ్రీ విష్ణు నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘సింగిల్’. ఒకవైపు లవ్ చేస్తూనే మరోవైపు ప్రేమ అంటే పడని కుర్రాడి పాత్రలో కనిపించనున్నాడు. శ్రీ విష్ణు కంఫర్ట్ జోన్‌లో వస్తున్న సినిమా ఇది. షూటింగ్ కూడా పూర్తికావొచ్చింది. రీసెంట్‌గా రిలీజ్ చేసిన గ్లింప్స్ మంచి రెస్పాన్స్ అందుకుంది. కేతికా శర్మ, ఇవానా హీరోయిన్లుగా నటిస్తుండగా.. శ్రీ విష్ణు ఫ్రెండ్ పాత్రలో వెన్నల కిషోర్ కనిపించనున్నాడు. కార్తీక్ రాజు డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
గీతా ఆర్ట్స్, కల్యా ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా మే నెలలో థియేటర్లోకి రానుంది. విడుదల తేదీ దగ్గర పడటంతో మేకర్స్ ప్రమోషనల్ కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నారు. దీనిలో భాగంగా ముందుగా ‘శిల్పి యెవరో’ అనే ఫస్ట్ సింగిల్‌తో మ్యూజిక్ ప్రమోషన్స్ కిక్ స్టార్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఈ పాట లిరికల్ వీడియోను రిలీజ్ చేసింది చిత్రయూనిట్. విశాల్ చంద్ర శేఖర్ సంగీత దర్శకుడిగా తన వెర్సటాలిటీని ప్రజెంట్ చేసే ఒక సోల్ ఫుల్ రొమాంటిక్ మెలోడీని కంపోజ్ చేశారు.
శ్రీమణి రాసిన సాహిత్యం, హీరో శ్రీ విష్ణు తన జీవితంలోని ఇద్దరు స్పెషల్ అమ్మాయిలు కేతిక శర్మ, ఇవానా అందం పట్ల ప్రశంసలను కురిపిస్తూ పాట ఆకర్షణను పెంచుతుంది. యాజిన్ నిజార్ సోల్ ఫుల్ వోకల్స్‌తో సాంగ్‌ని అద్భుతంగా అలపించారు. బ్యూటీఫుల్ విజువల్స్‌తో కూడిన ఈ సాంగ్‌లో శ్రీ విష్ణు క్యారెక్టర్ చార్మ్ అద్భుతంగా వుంది. శిల్పి ఎవరో యువతకు ఇన్‌స్టంట్‌గా కనెక్ట్ అవుతోంది. మోడరన్ వైబ్, థీమ్ యూత్‌ని మెస్మరైజ్ చేశాలా వున్నాయి.
ఇక ఇదిలావుంటే, శ్రీ విష్ణు చాలారోజుల తర్వాత వరుస చిత్రాలతో బిజీగా వున్నాడు. సింగిల్ సినిమాతో పాటుగా మరో 3 సినిమాలను లైన్‌లో పెట్టాడు. అందులో స్కంద వాహన మోషన్ పిక్చర్స్ బ్యానర్‌లో ఓ సినిమా చేస్తున్నాడు. జానకి రామ్ మారెళ్ల డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. దీనికి ‘బేబీ’ ఫేమ్ విజయ్ బుల్గానిన్ సంగీతం అందిస్తున్నాడు.
అలాగే ఎస్ఎస్‌సి బ్యానర్‌లో ఓ సినిమా చేస్తున్నాడు శ్రీ విష్ణు. మారుతీ రావు తెరకెక్కిస్తుండగా సుమంత్ నాయుడు నిర్మిస్తున్నారు. ఇవికాకుండా, ‘మృత్యంజయ్’ అనే సినిమా కూడా చేస్తున్నాడు. ‘సామజవరగమన’ తరువాత శ్రీ విష్ణు, రెబ్బా మోనికా జాన్ జంటగా నటిస్తున్నారు. లైట్ బాక్స్ మీడియా నిర్మిస్తున్న ఏ సినిమాకి హుస్సేన్ షా కిరణ్ డైరెక్ట్ చేస్తుండగా, కాల భైరవ సంగీతం అందిస్తున్నాడు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























