నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తోన్న మచ్ అవైటెడ్ మూవీ ‘HIT: The 3rd Case’. హిట్ ఫ్రాంచైజ్‌లో భాగంగా మూడో సినిమాగా వస్తోంది. యంగ్ అండ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే ఈ మూవీ నుంచి తాజాగా ఒక న్యూస్ లీక్ అయింది. HIT 3 క్లైమాక్స్‌లో ఒక స్టార్ హీరో సర్ప్రైజ్ విజిట్ ఇవ్వనున్నారనే టాక్ ప్రస్తుతం విపరీతంగా వైరల్ అవుతోంది. దీంతో దర్శకుడు బాగా డిజప్పాయింట్ అయ్యాడు. తను కానీ, తన టీం కానీ ఆడియెన్స్‌కి ఎప్పుడూ ఒక మంచి ట్రీట్ ఇవ్వాలనే భావిస్తామని, కానీ కొంతమంది దానిని ఇలా ముందే లీక్ చేసేసి ప్రేక్షకులకు థియేటర్లో ఆ ఎక్స్పీరియన్స్ లేకుండా చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు.
ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా.. “మన ప్రేక్షకులు సినిమాల్లో అనుభవించే ప్రతి ఒక్క ఉత్సాహ క్షణానికి, ఒక భారీ బృందం పగలు మరియు రాత్రులు అవిశ్రాంతంగా పనిచేస్తూ, వారి శారీరక సామర్థ్యాలకు మించి కష్టపడి పనిచేస్తుందనే కథ ఉంది. ఇవన్నీ మేము ఆడిటోరియంలో సృష్టించాలనుకునే ఆ ప్రభావం యొక్క క్షణం కోసం. దాని గురించి మేము గర్విస్తున్నాము.”
“నేటి మీడియా పరిస్థితి యొక్క దుస్థితిని చూడటం విచారకరం, వీరిలో కొందరు థియేటర్లలో మాత్రమే సినిమా చూస్తున్నప్పుడు ఆనందించడానికి ఉద్దేశించిన క్షణాల గురించి వివరాలను లీక్ చేయడానికి ముందు ఒక్క క్షణం కూడా ఆలోచించరు. ముందుగా నివేదించే ఉద్యోగం యొక్క స్వభావం అర్థమయ్యేదే అయినప్పటికీ, ఫలితాలను నివేదించడం సరైనదా కాదా అని అంచనా వేయడం వ్యక్తిగత జర్నలిస్ట్ మరియు మీడియా సంస్థల విలువలు మరియు నైతికతకు సంబంధించినది.”
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























