ఆ పుకార్లను నమ్మకండి.. కన్నప్ప టీమ్ స్పెషల్ రిక్వెస్ట్

Kannappa Team Clarifies on The Rumours Spreading Online

విష్ణు మంచు టైటిల్ రోల్‌లో నటిస్తున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’. ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీ భక్తిరస ఇతివృత్తంతో రూపొందుతోంది. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ మహా శివుడి పాత్రలో కనిపిస్తుండగా.. పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ రుద్ర అనే ప్రత్యేక పాత్రను పోషిస్తున్నారు. ఇప్పటికే కన్నప్ప నుండి టీజర్ మరియు మూడు పాటలను రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ అందుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఏప్రిల్ 25న ఈ సినిమా విడుదల కావాల్సివుండగా వీఎఫ్ఎక్స్ వర్క్స్ డిలే కారణంగా రిలీజ్ వాయిదా పడింది. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ ప్రకటించనుంది చిత్రయూనిట్. అయితే కన్నప్ప చిత్రంపై రోజుకో న్యూస్ నెట్టింట హల్ చల్ చేస్తోంది. అలాగే ఈరోజు ఉదయం నుంచికూడా రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కన్నప్ప టీమ్ దీనిపై స్పందించింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా తాజాగా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది.

“ఆన్‌లైన్‌లో వ్యాపించే పుకార్లకు విరుద్ధంగా, నిన్న పూర్తి సినిమా ప్రీమియర్ లేదా స్క్రీనింగ్ జరగలేదు. కన్నప్ప బృందం నాణ్యత అంచనా మరియు దిద్దుబాట్ల కోసం 15 నిమిషాల VFX విభాగాన్ని మాత్రమే సమీక్షించింది. విస్తృతమైన మరియు వివరణాత్మక VFX పని కారణంగా, సినిమా యొక్క మొదటి కట్ ఇంకా పురోగతిలో ఉంది, దీనికి గణనీయమైన సమయం మరియు కృషి అవసరం.”

“ఈ సమయంలో మా సినిమాకి సంబంధించి ఎలాంటి ధృవీకరించని సమాచారాన్ని నమ్మవద్దని లేదా వ్యాప్తి చేయవద్దని అభిమానులు మరియు మీడియాను మేము అభ్యర్థిస్తున్నాము. అధికారిక నవీకరణలు త్వరలో ప్రకటించబడతాయి. మీ అవగాహన మరియు నిరంతర మద్దతుకు ధన్యవాదాలు. ఇట్లు — టీం కన్నప్ప” అని అందులో పేర్కొంది.

కాగా కన్నప్ప చిత్రంలో దేశవ్యాప్తంగా వివిధ భాషలకు చెందిన ప్రముఖ నటీనటులు నటిస్తున్న విషయం తెలిసిందే. మోహన్ బాబు, మోహన్ లాల్, మధుబాల, శరత్ కుమార్, దేవరాజ్, హీరోయిన్ ప్రీతి ముఖుంధన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అలాగే బ్రహ్మానందం, సప్తగిరి తదితరులు నటిస్తున్నారు. ఇక వీరితోపాటుగా విష్ణు మంచు కుమార్తెలు, కుమారుడు మరో ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. బాలీవుడ్ దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రానికి స్టీఫెన్ దేవస్సీ సంగీతం సమకూరుస్తున్నాడు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.