నాగబాబుని అభినందించిన మెగాస్టార్ దంపతులు

Megastar Chiranjeevi Congratulates Brother Naga Babu as He Took Oath as AP MLC

మెగాస్టార్ చిరంజీవి పెద్ద త‌మ్ముడు నాగబాబుని అభినందించారు. తాజాగా నాగబాబు ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సోదరుడిని పూలమాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక బుధవారం నాగబాబు ఏపీ శాసన మండలి చైర్మన్ సమక్షంలో ఎమ్మెల్సీగా ప్రమాణం చేసి బాధ్యతలు చేపట్టారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అయితే శాసన మండలి సభ్యునిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ఆయన నేరుగా చిరంజీవి ఇంటికి వ‌చ్చి అన్న, వ‌దిన‌ల ఆశీర్వాదం తీసుకున్నారు. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో జనసేన అధ్యక్షుడు, చిరు చిన్న తమ్ముడు పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత కూడా ఇలాగే అన్న, వదినల ఆశీర్వాదం తీసుకున్న విషయం గుర్తుండేవుంటుంది.

కాగా కొణిదెల నాగబాబు గ‌త నెలలో జరిగిన శాసన సభ్యుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో నిన్న ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేశారు. ఇక త‌మ్ముడిని స‌త్క‌రించిన ఫొటోల‌ను చిరంజీవి సోష‌ల్ మీడియాలో వేదికగా షేర్ చేసి అభిమానులతో తన ఆనందాన్ని పంచుకున్నారు. దీంతో వీరి అనుబంధాన్ని చూసిన మెగా ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు నాగ‌బాబు త‌న సతీమ‌ణితో క‌లిసి ఆంధ్రప్రదేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడిని కూడా మర్యాదపూర్వకంగా క‌లిశారు. ఇక నూతన ఎమ్మెల్సీగా ఎన్నికైన నాగ‌బాబుకి పలువురు సినీ ప్ర‌ముఖులు, రాజ‌కీయ నాయ‌కులు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు. కాగా నాగ‌బాబు ప్రస్తుతం తన తమ్ముడు, పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీకి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.