మ్యాడ్ స్క్వేర్ సాలిడ్ వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద డామినేషన్ కొనసాగిస్తుంది.కేవలం మూడు రోజుల్లోనే 50 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చి సెన్సేషన్ సృష్టించగా నిన్న కూడా అదిరిపోయే వసూళ్లను రాబట్టుకుంది.రంజాన్ సందర్భంగా హాలిడే కావడంతో సూపర్ హోల్డ్ తో మొత్తం నాలుగు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 69.4 కోట్ల గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకుంది.ఇప్పటికే నైజాం ,ఓవర్సీస్ లో ప్రాఫిట్ లోకి వచ్చేసింది.ఈరోజుతో అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ కానుంది.అటు నార్త్ అమెరికాలో 1మిలియన్ మార్క్ ను క్రాస్ చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అలాగే రేపటి నుండి ఆంధ్రాలో నార్మల్ టికెట్ రేట్స్ తో అందుబాటులోకి రానుంది.రివ్యూస్ అంత ఎంకరేజింగ్ గా లేకున్నా మౌత్ టాక్ తో మ్యాడ్ స్క్వేర్ అద్భుతమైన రన్ ను కొనసాగిస్తోంది.ఫుల్ రన్ లో ఈసినిమా 100కోట్ల మార్క్ ను టచ్ చేయనుండడంతో బయ్యర్ల పాలిట జాక్ పాట్ కానుంది. మొత్తానికి మ్యాడ్ సీక్వెల్ ట్యాగ్ తో వచ్చిన మ్యాడ్ స్క్వేర్, టిల్లు స్క్వేర్ ఫలితాన్ని రిపీట్ చేస్తుంది.
యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా కళ్యాణ్ శంకర్ తెరకెక్కించిన ఈసినిమాలో నార్నె నితిన్,సంగీత్ శోభన్ ,రామ్ నితిన్ ,విష్ణు ఓయ్ లీడ్ రోల్స్ లో నటించగా భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించాడు.సూర్యదేవర హారిక , సాయి సౌజన్య ఈసినిమాను నిర్మించారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























