ఎన్టీఆర్ నీల్ నార్త్ అమెరికా రైట్స్ సోల్డ్

The North American theatrical business deal for NTR and Neel's movie has been closed

స్టార్ హీరో ఎన్టీఆర్, టాప్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.రీసెంట్ గానే ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయ్యింది.ఇక ఈసినిమా అలా సెట్స్ మీదకు వెళ్లిందో లేదో అప్పుడే ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా స్టార్ట్ అయిపొయింది.అందులో భాగంగా నార్త్ అమెరికా థియేట్రికల్ రైట్స్ ను ప్రత్యంగిరా సినిమాస్ సొంతం చేసుకుంది.అత్యంత భారీ ధరకు ఈ డీల్ క్లోజైనట్లు సమాచారం.ఇక ఇదిలా ఉంటే ఎన్టీఆర్ ఈసినిమా షూటింగ్ లో జాయిన్ అవ్వడానికి రెడీ అవుతున్నాడు.నెక్స్ట్ షెడ్యూల్ నుండి షూటింగ్ లో పాల్గొనున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఎన్టీఆర్ బర్త్ డే సందర్బంగా మే 20న ఈసినిమా నుండి అప్డేట్ ఇవ్వనున్నారు.ఈ క్రేజీ కాంబినేషన్ ఫై భారీ అంచనాలు వున్నాయి.ఇందులో కెజిఎఫ్ ఫేమ్ రుక్మిణి వసంత్ ను హీరోయిన్ గా తీసుకోవాలనుకుంటున్నారట.రవి బసృర్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ ,ఎన్టీఆర్ ఆర్ట్స్ నిర్మిస్తున్నాయి.వచ్చే ఏడాది జనవరి 9న థియేటర్లలోకి రానుంది.

ఇక ఎన్టీఆర్ ప్రస్తుతం హిందీలో వార్ 2 చేస్తున్నాడు.హృతిక్ రోషన్ ఇందులో మరో హీరోగా నటిస్తుండగా అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్నాడు. షూటింగ్ కూడా తుది దశకు చేరుకుంది.యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తుంది.ఆగస్టు 14న విడుదలకానుంది.త్వరలోనే ప్రమోషన్స్ మొదలు పెట్టనున్నారు.ఎన్టీఆర్ కు హిందీలో ఇదే మొదటి సినిమా.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.