మెగా స్టార్ చిరంజీవి ,సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్షన్ లో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. రేపు ఉగాదికి ఈసినిమా లాంఛ్ కానుంది. రామానాయుడు స్టూడియో లో పూజా కార్యక్రమాలతో సినిమాను ప్రారంభించనున్నారు.జూన్ నుండి రెగ్యులర్ షూటింగ్ జరుగనుంది.సినిమాను తొందరగా పూర్తి చేసి వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదలచేయనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అనిల్ మార్క్ ఎంటర్టైనర్ గా తెరకెక్క నున్న ఈసినిమాలో చిరుకి జోడీగా ఓ సీనియర్ హీరోయిన్ ను తీసుకోనున్నారు.భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించనుండగా చిరంజీవి పెద్ద కూతరు సుష్మిత కొణిదెల ,షైన్ స్క్రీన్ అధినేత సాహు గారపాటి నిర్మించనున్నారు.రేపు మరిన్ని వివరాలు వెలుబడనున్నాయి.
ఇందులో వింటేజ్ చిరు చూపించనున్నాడు అనిల్ రావిపూడి.రీసెంట్ గా సంక్రాంతికి వస్తున్నాంతో బిగెస్ట్ బ్లాక్ బస్టర్ ఇచ్చి పీక్ ఫామ్ లో వున్నాడు అనిల్. దాంతో అనిల్ చిరు కాంబినేషన్ లో వచ్చే సినిమా పై భారీ అంచనాలు వున్నాయి.
ఇక ప్రస్తుతం చిరంజీవి, విశ్వంభరను పూర్తి చేసే పనిలో వున్నాడు.వశిష్ఠ ఈసినిమాను తెరకెక్కిస్తుండగా షూటింగ్ ఆల్మోస్ట్ పూర్తికావొచ్చింది. త్రిష ఇందులో కథానాయికగా నటిస్తుంది.సోషియో ఫాంటసీ బ్యాక్ డ్రాప్ లో భారీ బడ్జెట్ తో యువీ క్రియేషన్స్ నిర్మిస్తుంది.ఈఏడాది జులై లేదా ఆగస్టు లో రిలీజ్ చేయాలని చూస్తున్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























