వాయిదా పడిన కన్నప్ప

Vishnu Manchu Announces Kannappa Has Been Postponed,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2025,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Kannappa,Kannappa Movie,Kannappa Telugu Movie,Kannappa Movie Updates,Kannappa Movie News,Kannappa Movie Latest News,Kannappa Movie Latest Update,Kannappa Update,Kannappa Release Date Update,Kannappa Movie Release Date Update,Manchu Vishnu,Manchu Vishnu Movies,Manchu Vishnu New Movie,Manchu Vishnu Latest Movie,Manchu Vishnu Kannappa,Manchu Vishnu Kannappa Movie,Manchu Vishnu Kannappa Postponed,Kannappa Postponed,Kannappa Movie Postponed,Kannappa Release Delayed,Kannappa Release Postponed,Kannappa Movie Release Date Postponed,Manchu Vishnu's Kannappa Release Pushed,Manchu Vishnu’s Kannappa Gets Postponed,Kannappa Movie Release Postponed,Manchu Vishnu Kannappa Movie Release Date Postponed

హీరో విష్ణు మంచు టైటిల్ రోల్‌లో నటిస్తున్న తాజా చిత్రం ‘కన్నప్ప’. ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీ నుంచి వరుసగా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అందిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ పాత్రకు సంబంధించి ఫస్ట్ లుక్ రివీల్ చేసిన చిత్ర యూనిట్.. అంతకుముందు బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ మహా శివుడి క్యారక్టర్ పోస్టర్ విడుదలచేసిన సంగతి గుర్తుండేవుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక రీసెంట్ గానే కన్నప్ప నుండి టీజర్ మరియు మూడు పాటలను రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ నుంచి కీలక అప్డేట్ వచ్చింది. ధైర్యవంతుడైన యోధుడు శివుని భక్తుడైన కన్నప్ప కథతో రాబోతున్న కన్నప్ప రిలీజ్ వాయిదా పడింది. నాణ్యమైన వీఎఫ్ఎక్స్ కోసం ఈ చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్టు హీరో విష్ణు మంచు ప్రకటించారు. అలాగే త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ తెలియజేస్తామని కూడా వెల్లడించారు.

కాగా కన్నప్ప చిత్రంలో దేశవ్యాప్తంగా వివిధ భాషలకు చెందిన ప్రముఖ నటీనటులు నటిస్తున్న విషయం తెలిసిందే. మోహన్ బాబు, మోహన్ లాల్, మధుబాల, శరత్ కుమార్, దేవరాజ్, హీరోయిన్ ప్రీతి ముఖుంధన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అలాగే బ్రహ్మానందం, సప్తగిరి తదితరులు నటిస్తున్నారు. ఇక వీరితోపాటుగా విష్ణు మంచు కుమార్తెలు, కుమారుడు మరో ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు.

మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేస్తున్నారు. స్టీఫెన్ దేవస్సీ సంగీతం సమకూరుస్తున్నాడు. సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చే విజువల్ వండర్‌గా కన్నప్ప ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.