L2: ఎంపురాన్.. రెండు రోజుల్లోనే కొట్టేసింది

L2: Empuraan Surpasses 100 Cr at Worldwide Box Office,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2025,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Prithviraj Sukumaran,Prithviraj Sukumaran Movies,Prithviraj Sukumaran Telugu Movie,Mohanlal,Mohanlal Movies,Mohanlal New Movie,L2 Empuraan,L2 Empuraan Movie,L2 Empuraan Telugu Movie,L2 Empuraan Movie Updates,L2 Empuraan Movie Trailer,L2 Empuraan Movie Latest News,L2 Empuraan Collections,L2 Empuraan Movie Collections,L2 Empuraan Movie Latest Collections,L2 Empuraan Movie Box Office Collections,L2 Empuraan Movie Box Office,L2 Empuraan Box Office Collection,L2 Empuraan Box Office Collection Day 2,L2: Empuraan Box Office Collection Day 2,Empuraan Box Office Collection Day 2

మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్‌ ప్రధానపాత్రలో నటించిన తాజా చిత్రం ‘లూసిఫర్‌ 2: ఎంపురాన్‌’ (L2E). మరో స్టార్ హీరో కం డైరెక్టర్ పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ దర్శకత్వం వహించాడు. 2019లో వచ్చిన సూపర్ హిట్ సినిమా ‘లూసిఫర్‌’ మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కింది. మూవీ విడుదలకు ముందే రిలీజ్ చేసిన ప్రతి ప్రమోషనల్ కంటెంట్ మూవీపై అంచనాలను విపరీతంగా పెంచేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలో భారీ అంచనాల నడుమ L2: ఎంపురాన్‌ మార్చి 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగులో దీనిని స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఆధ్వర్యంలోని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ రిలీజ్ చేసింది. అయితే సినిమాపై ఉన్న హైప్ దృష్ట్యా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా కేవలం ప్రీ సేల్స్ బుకింగ్స్ తోనే రూ.70కోట్లకు పైగా బిజినెస్ చేసింది.

ఇక రిలీజ్ తర్వాత మూవీకి పాజిటివ్ టాక్ రావడంతో విడుదలైన అన్నిచోట్లా సక్సెస్‌ ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా L2: ఎంపురాన్ 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అయితే కేవలం రెండే రెండు రోజుల్లో ఈ మార్క్ అందుకోవడం విశేషం. ఇంతకుముందు మరే మలయాళీ మూవీకి ఇది సాధ్యపడలేదు.

కాగా మలయాళ పరిశ్రమకు సంబంధించి అత్యంత భారీ బడ్జెట్‌ చిత్రం ఇదే కావడం గమనార్హం. దాదాపు 150 కోట్ల బడ్జెట్‌తో దీనిని తెరకెక్కించారు మేకర్స్. ఇక ఇందులో మోహన్‌లాల్‌, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌, టోవినో థామస్, జెరోమ్ ఫ్లిన్, అభిమన్యు సింగ్, ఆండ్రియా తివాదర్, సూరజ్ వెంజరమూడు, మంజు వారియర్, సానియా అయ్యప్పన్, సాయికుమార్, సచిన్ ఖేడ్కర్ తదితరులు నటించారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.