టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ లు తమిళ హీరోలు ,డైరెక్టర్ల తో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపుతున్నాయి.అందులో భాగంగా విజయ్ తో ఇంతకుముందు దిల్ రాజు,వారిసు చేసి కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు.మైత్రి మూవీస్ ప్రస్తుతం తమిళ్ లో రెండు సినిమాలు చేస్తుంది.అందులో అజిత్ తో ఒక సినిమా వుంది.ఇక నెక్స్ట్ హైయెస్ట్ సక్సెస్ రేట్ వున్న సితార ఎంటర్టైన్మెంట్స్ కూడా కోలీవుడ్ డైరెక్టర్ తో భారీ బడ్జెట్ సినిమా చేయనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
జైలర్ తరువాత నెల్సన్ తో సినిమా చేయాలని నాగవంశీ ఎదురుచూస్తున్నారు.హీరోగా ఎన్టీఆర్ అయితే ఈ కాంబినేషన్ అదిరిపోతుందని భావిస్తున్నారు.ఎన్టీఆర్ కూడా ఆసక్తిగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.అయితే ఇప్పటివరకు అధికారకంగా ఎలాంటి ప్రకటన రాలేదు.
ఇక ఈ కాంబినేషన్ గురించి తాజాగా నాగవంశీ స్పందించారు.నెల్సన్ తో సినిమా ఉంటుంది వచ్చే ఏడాది.అయితే హీరో ఎవరనేది మాత్రం ఇంకా ఫిక్స్ అవ్వలేదు అని నాగవంశీ చెప్పారు.సో సితారలో నెల్సన్ సినిమా చేయడం అయితే ఫిక్స్.మరి ఏ స్టార్ హీరో ఈ ప్రాజెక్ట్ లో జాయిన్ అవుతారో చూడాలి.
ప్రస్తుతం నెల్సన్ రజినీకాంత్ తో జైలర్ 2 చేస్తున్నారు.సన్ పిక్చర్స్ ఈసినిమాను నిర్మిస్తుండగా అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు.జైలర్ తెలుగులో కూడా బ్లాక్ బస్టర్ కావడంతో ఈ సీక్వెల్ పై భారీ అంచనాలు వున్నాయి.ఈసినిమాను పూర్తి చేసి నెల్సన్ నెక్స్ట్ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సినిమా చేయనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























