రాబిన్‌హుడ్‌లో నా క్యారక్టర్ ఎలా ఉంటుందంటే..?

Hero Nithiin Reveals His Character in Robinhood

హీరో నితిన్ నటించిన లేటెస్ట్ హీస్ట్ కామెడీ ఎంటర్ టైనర్ రాబిన్‌హుడ్. శ్రీలీల కథానాయికగా నటించింది. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ హై బడ్జెట్ తో నిర్మించారు. ఈ చిత్రంలో నట కిరీటి రాజేంద్రప్రసాద్ కీలక పాత్ర పోషించారు. ఆస్ట్రేలియా డైనమిక్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ప్రత్యేక అతిధి పాత్రలో నటించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన పాటలు చార్ట్ బస్టర్ హిట్ అయ్యాయి. ఈ సినిమా మార్చి 28న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా నిర్వహించిన Q అండ్ A ప్రెస్ మీట్ లో మీడియా ఆడిన ప్రశ్నలు చిత్ర యూనిట్ సమాధానాలు ఇచ్చారు.

నితిన్ గారు ఇందులో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతోంది?

  • నా క్యారెక్టర్ ఇందులో వెరీ బిగ్ మానిప్యులేటర్. చాలా స్మార్ట్ మైండ్. ఫిజికల్ స్ట్రెంత్ కంటే మెంటల్ స్ట్రెంత్ ఎక్కువగా ఉండే క్యారెక్టర్. ఫస్ట్ టైం ఇలాంటి క్యారెక్టర్ ప్లే చేస్తున్నాను.
  • క్లైమాక్స్ లో నా క్యారెక్టర్ రౌండప్, వచ్చే ట్విస్టులు, షాకులు చాలా ఫ్రెష్ గా ఉంటాయి. భీష్మ సినిమాలో కంటే నా క్యారెక్టర్ వెరీ స్ట్రీట్ స్మార్ట్ గా ఉంటుంది. వెరీ ఇంటలెక్చువల్ క్యారెక్టర్.

వెంకీ గారు ఎంటర్టైన్మెంట్ కి పెద్ద పీట వేస్తూ ప్రమోషన్స్ చేశారు. కానీ ఇందులో చాలా మంచి ఎమోషన్ కూడా ఉందని సెన్సార్ టాక్ వచ్చింది. ఎమోషన్ ప్రమోషన్స్ లో దాచిపెట్టడానికి కారణం?

  • సినిమా అంతా షుగర్ కోట్ లాగా ఫన్ కోటెడ్ గా ఉంటుంది. కానీ సినిమాలలో సోల్ ఎమోషనే. ఆ ఎమోషన్ సీక్వెన్స్ చాలా బాగా వర్కౌట్ అయింది.
  • అది మీరు బిగ్ స్క్రీన్ లోనే చూడాలి. ఇప్పటివరకు చూసినవారు చాలా అద్భుతంగా ఉందని చెప్పారు

వెంకీ గారు వార్నర్ గారు ఎలాంటి మ్యాజిక్ చేయించారు?

  • ఇందులో ఒక క్యామియో రోల్ ఇంటర్నేషనల్ స్టార్ చేస్తే బాగుంటుందని ఆ పాత్రకు వార్నర్ అనుకున్నా.
  • నిర్మాత రవి గారు చాలా సీరియస్ గా ట్రై చేసి మీటింగ్ అరేంజ్ చేశారు. నేను ఇచ్చిన నరేషన్ ఆయన నచ్చి అంగీకరీంచారు.
  • ఇందులో ఆస్ట్రేలియా ఎపిసోడ్ వుంది. వార్నర్ క్యామియో అక్కడే షూట్ చేశాం. అది మీరు థియేటర్లో చూసినప్పుడే మ్యాజిక్ ఉంటుంది.
  • దాని గురించి ఇప్పుడు చెప్తే సర్ప్రైజ్ మిస్ అవుతుంది. థియేటర్స్ లో చూసినప్పుడు ఖచ్చితంగా ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు.

రవి గారు టికెట్స్ రేట్స్ లో కొన్ని చోట్ల హై కనిపిస్తుంది.. దీనివల్ల ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా?

  • ఏం లేదండి . 95% పాత రేట్లే వున్నాయి. ఐదు శాతం అది కూడా కొన్ని మాల్స్ లో మాత్రమే స్మాల్ చేంజ్ వుంటుంది.
  • అది కూడా ఎఫర్టబుల్ గానే ఉంటుంది. టికెట్ రేట్ వల్ల ఈ సినిమా చూడలేదనే ఫీలింగ్ ఎక్కడా ఉండదు.

నితిన్ గారు ఈ సినిమా నుంచి ఆడియన్స్ ఏమి ఆశించవచ్చు?

  • ఈ సినిమా చాలా మంచి ఎంటర్ టైన్మెంట్ వుంది. ఎమోషన్ కూడా ఉంది. హార్ట్ టచింగ్ పాయింట్ ఉంది.
  • క్లైమాక్స్ చాలా బాగుంటుంది. ఆడియన్స్ కి చాలా కొత్త అనుభూతి పొందుతారు.

నితిన్ గారు శ్రీలీల గారితో వర్క్ ఎలా అనిపించింది?

  • శ్రీలీలతో ఇది నా సెకండ్ ఫిల్మ్. తను చాలా స్వీట్.
  • షూటింగ్ అంతా చాలా చక్కగా జరిగింది. తనతో ఫ్యూచర్ లో మళ్ళీ వర్క్ చేయాలని వుంది.

రవి గారు ఈ వారం నాలుగు సినిమాలు వస్తున్నాయి.. సోలో డేట్ వుంటే ఇంకా బెటర్ గా ఉండేది కదా?

  • ఈ రోజుల్లో ఉన్న పోటీ ప్రపంచంలో సోలో ఆశించకూడదు. మేము వస్తున్నప్పుడు ఒకటే సినిమా అనుకున్నాం. కానీ రెండు డబ్బింగ్ సినిమాలు వచ్చాయి. ఇది మేము ముందుగా ఊహించలేదు.
  • ఎవరి సినిమాలు. ఎవరి డేట్లు, ఎవరి కమిట్మెంట్లు వాళ్లకు ఉంటాయి. మనం చేస్తున్నప్పుడే సోలోడేట్ అని ఫిక్స్ అవ్వకుండా పోటీ తప్పదనే మైండ్ సెట్ తోనే దిగాలని భావిస్తాను.

రవి గారు మీ మైత్రికి బిగ్గెస్ట్ హిట్ రంగస్థలం. ఆ డేట్ సెంటిమెంట్ గా ఈ రిలీజ్ డేట్ ఎంచుకున్నారా?

  • రంగస్థలం సమ్మర్ లో వచ్చిన ఫస్ట్ సినిమా. ఈ సినిమా కూడా సమ్మర్ లో వస్తున్న ఫస్ట్. సినిమాకి డెఫినెట్ గా ఆ అడ్వాంటేజ్ ఉంటుంది. పరీక్షలు ఫినిష్ అయ్యాయి.
  • యూత్ కూడా ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తున్నారు. రంగస్థలం ఎలాంటి మ్యాజిక్ చేసిందో ఈ సినిమా కూడా అలాంటి మ్యాజిక్ చేయాలని కోరుకుంటున్నాను.

నితిన్ గారు మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో వర్క్ చేయడం ఎలా అనిపించింది?

  • వెరీ హ్యాపీ. మైత్రి మూవీ మేకర్స్ ఇండియాలోనే బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌస్. మా సినిమా కూడా బ్యానర్ ప్రతిష్టని పెంచే సినిమా అవుతుందని నమ్మకం ఉంది.

ఆల్ ది బెస్ట్..

థాంక్ యూ.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.