హీరో నితిన్ నటించిన లేటెస్ట్ హీస్ట్ కామెడీ ఎంటర్ టైనర్ రాబిన్‌హుడ్. శ్రీలీల కథానాయికగా నటించింది. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ హై బడ్జెట్ తో నిర్మించారు. ఈ చిత్రంలో నట కిరీటి రాజేంద్రప్రసాద్ కీలక పాత్ర పోషించారు. ఆస్ట్రేలియా డైనమిక్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ప్రత్యేక అతిధి పాత్రలో నటించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన పాటలు చార్ట్ బస్టర్ హిట్ అయ్యాయి. ఈ సినిమా మార్చి 28న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించింది.
ఈ సందర్భంగా హీరో నితిన్ మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. రాబిన్ హుడ్ ఫైనల్ కాఫీ చూసాము. చాలా హ్యాపీగా ఉన్నాము. సినిమా చేసినప్పుడు ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నానో, చూసుకున్నప్పుడు కూడా అంతే కాన్ఫిడెంట్ గా అనిపించింది. వెంకీ, నా కాంబినేషన్లో వచ్చిన ‘భీష్మ’ కంటే ఈ సినిమా చాలా బాగుండబోతుంది. మార్చి 28న సినిమా రిలీజ్ అవుతుంది. కచ్చితంగా ఆడియన్స్ అందరికీ సినిమా నచ్చుతుందని నమ్మకం ఉంది. ఆడియన్స్ రెస్పాన్స్ కోసం ఎదురుచూస్తున్నాను” అని అన్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























