ఇకపై ప్రతి ఏడాది గద్దర్ అవార్డ్స్ – TFDC చైర్మన్ దిల్ రాజు

TFDC Chairman Dil Raju Key Announcement on Gaddar Awards in Telangana

తెలంగాణలో ఇకపై ప్రతి ఏడాది గద్దర్ అవార్డ్స్ అందజేస్తామని ప్రకటించారు తెలంగాణ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ (TFDC) చైర్మన్, స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు. ఈ మేరకు ఆయన ఈ అవార్డులకు సంబంధించిన వివరాలను తెలియజేసేందుకు ఈరోజు సమాచార భవన్‌లో ప్రెస్ మీట్ నిర్వహించారు. తెలుగుతోపాటు ఉర్దూ సినిమాలను ప్రోత్సహించనున్నామని, ఆ సినిమాలకు బెస్ట్‌ ఫిల్మ్‌ అవార్డులు అందిస్తామని స్పష్టం చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌ రెడ్డి ఇంతకుముందు చెప్పినట్టుగానే గద్దర్‌ అవార్డులను త్వరలోనే ఇవ్వనున్నట్లు తెలిపారు. అలాగే పైడి జయరాజ్, కాంతారావుల పేరుతో గౌరవ అవార్డులు కూడా ఇస్తామని తెలిపారు. ఏప్రిల్‌ నెలలో అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని వేడుకగా నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని చెప్పారు. ఈ సందర్భంగా దిల్ రాజు పలు కీలక విషయాలను వెల్లడించారు.

TFDC చైర్మన్ దిల్ రాజు ప్రసంగంలోని ముఖ్యాంశాలు..

  • గద్దర్ అవార్డ్స్ కోసం ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది
  • కమిటీ గైడ్ లైన్స్ ని ప్రిపేర్ చేసింది
  • 2024 లో సినిమాలు నిర్మించిన నిర్మాతలకు గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ విధివిధానాలు పంపిస్తాము.
  • నంది అవార్డ్స్ కు ఏ గైడ్ లైన్స్ ఉన్నాయో.. అలాగే చిన్న చిన్న మార్పులతో గద్దర్ అవార్డ్స్ కి కూడా అలాంటి గైడ్ లైన్స్ ఉంటాయి.
  • ఇకనుంచీ ఉర్దూ భాషని కూడా ప్రోత్సాహిస్తాము.
  • 2014 నుంచి 2023 వరకు ఒక్కో ఏడాదికి ఒక్కో సినిమాకు గద్దర్ అవార్డు
  • 2014 జూన్ నుంచి 2023 డిసెంబర్ 31 వరకు విడుదల అయిన వాటిలో ప్రతి ఏడాది ఒక బెస్ట్ ఫిల్మ్ అవార్డు ఇవ్వనున్నాము.
  • 2024కి సంబందించిన విధివిధానాలు రూపొందించాము.
  • వన్ వీక్ లో అవార్డులను జ్యూరీ పైనల్ చెస్తుంది.
  • గద్దర్ అవార్డ్ నమూనా కూడా సిద్దం అవుతుంది.
  • ఏప్రిల్ లో అవార్డ్స్ ఫంక్షన్ ఉంటుంది.
  • అధ్బుతమైన ఈవెంట్ జరగబోతుంది.
  • అవార్డులు ఎవరైనా ఇవ్వొచ్చు.
  • ఫిలిం ఛాంబర్ కూడా ఇస్తుంది.
  • గతంలో ఉన్న అవార్డుల్లో ఒకటి రెండు మార్పులు జరిగాయి
  • పైడిజయరాజ్, కాంతారావుల పేరుతో గౌరవ అవార్డులుంటాయి.
  • తెలుగుతోపాటు ఉర్దూ సినిమాలకు అవార్డుల్లో ప్రాధాన్యత.
  • అవార్డుల విషయాన్ని వివాదం చేయొద్దు
  • మనం ఏపని చేసినా 51 శాతం పాజిటివ్‌ గా ఉండే చాలు.‌ నెగిటివ్ ప్రచారాలు అనవసరం.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.