నేచురల్ స్టార్ నాని వాల్ పోస్టర్ సినిమా సమర్పించిన మూవీ ‘కోర్ట్’ – స్టేట్ వర్సెస్ ఎ నోబడీ’ ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటిస్తున్న నటిస్తున్న ఈ చిత్రాన్ని రామ్ జగదీష్ దర్శకత్వం వహించారు. ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. దీప్తి గంటా సహ నిర్మాతగా వ్యవహరించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ చిత్రం మార్చి 14న హోలీ పండుగ సందర్భంగా విడుదల కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ అండ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ని నిర్వహించారు. బ్లాక్ బస్టర్ డైరెక్టర్స్ నాగ్ అశ్విన్, ప్రశాంత్ వర్మ, శైలేష్ కొలను, శ్రీకాంత్ ఓదెల, శౌర్యువ్, ఇంద్రగంటి మోహన కృష్ణ, దేవకట్టా ఈ వేడుకలో అతిధులుగా పాల్గొన్నారు. మూవీ యూనిట్ అంతా పాల్గొన్న ఈ వేడుక చాలా గ్రాండ్‌గా జరిగింది.
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు రామ్ జగదీష్ హీరో నానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ యంగ్ డైరెక్టర్ ఏమన్నారంటే.. “ఈ స్టేజ్ నాకు చాలా ప్రత్యేకం. నా జర్నీలో సపోర్ట్ చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. నా రైటింగ్ టీం డైరెక్షన్ టీం కి థాంక్యూ. వీళ్లంతా పేపర్ మీద సినిమా చూసిన మనుషులు. డీవోపీ దినేష్ ‘లవ్ టుడే, మహారాజా’ లాంటి 100 కోట్లు సినిమా తీసిన కెమెరామెన్.”
“ఆయన మా కోర్ట్ ని సెలెక్ట్ చేసుకోవడం లక్కీగా ఫీల్ అవుతున్నా. తన కెమెరాతో ఈ సినిమాకి జీవం పోశాడు. విజయ్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. విటల్ గారు సహజంగా కనిపించే సెట్స్ వేశారు. ప్రశాంతి గారు దీప్తి గారు ఈ సినిమాకి మెయిన్ పిల్లర్స్. ఈ సినిమాకి పనిచేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. రోషన్ శ్రీదేవి ఈ సినిమాకి హార్ట్ అండ్ సోల్.”
“దర్శి అన్నకి బలగం ముందు ఈ కథ చెప్పాను. అప్పటికీ ఇప్పటికీ ఒకేలా వున్నారు. నాని గారు వన్ అండ్ ఓన్లీ. నాని ప్రోడక్ట్ కావడం చాలా ఆనందంగా వుంది. ఇదొక గొప్ప లెగసీ. ఆయన నమ్మిన విధానం అద్భుతం. అది చాలా బాధ్యత పెంచింది. 14 తారీకు ఆ నమ్మకాన్ని తిరిగి ఇచ్చేస్తాను. కోర్టు మన అందరికీ జీవితం. థియేటర్స్ కి రండి. ఆ రోజు మాట్లాడుకుందాం” అని అన్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























