‘కోర్ట్’ సినిమా చూశాక, నచ్చితేనే తన ‘హిట్ 3’ చిత్రం చూడటానికి థియేటర్లకు రావాలని, లేదంటే రావొద్దని ప్రేక్షకులను కోరారు నేచురల్ స్టార్ నాని. ఈ మేరకు ఆయన తాజాగా తాను నిర్మించిన లేటెస్ట్ మూవీ ‘కోర్ట్: స్టేట్ వర్సెస్ ఎ నోబడీ’ ప్రీ రిలీజ్ వేడుకలో మాట్లాడారు. రామ్ జగదీశ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మార్చి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీప్తి గంటా సహ నిర్మాతగా వ్యవహరించగా.. ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ అండ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ని నిర్వహించారు. బ్లాక్ బస్టర్ డైరెక్టర్స్ నాగ్ అశ్విన్, ప్రశాంత్ వర్మ, శైలేష్ కొలను, శ్రీకాంత్ ఓదెల, శౌర్యువ్, ఇంద్రగంటి మోహన కృష్ణ, దేవకట్టా ఈ వేడుకలో అతిధులుగా పాల్గొన్నారు. మూవీ యూనిట్ అంతా పాల్గొన్న ఈ వేడుక చాలా గ్రాండ్‌గా జరిగింది.
ఈ సందర్భంగా హీరో నాని చిత్ర విశేషాలు వివరించారు. నాని ఏమన్నారో ఆయన మాటల్లోనే.. “ఇక్కడికి వచ్చిన మా డైరెక్టర్స్ కి థాంక్యూ సో మచ్. ఈ సినిమా గురించి ఒక విషయం బలంగా చెబుతున్నాను. 14న ఈ సినిమాని మీరు మిస్ అవ్వకండి. నా కెరియర్ లో ఎప్పుడూ కూడా దయచేసి సినిమా చూడండి అని అడగలేదు. కానీ ఈ సినిమా కడుగుతున్నాను. దయచేసి ఈ సినిమా చూడండి.”
“14న థియేటర్ కి వెళ్ళండి. ఇలాంటి మంచి సినిమా మీరు మిస్ అవ్వకూడదని చెబుతున్నాను. మాకేదో సక్సెస్ రావాలని కాదు. తెలుగు ప్రేక్షకులు ఇలాంటి మంచి సినిమాని మిస్ కాకూడదని చెబుతున్నాను. మీ అందరిని బ్రతిమాలుతున్నాను. ఫ్యామిలీతో కలిసి సినిమాకి వెళ్ళండి. గొప్ప సినిమా చూశారానే ఫీలింగ్ తో వస్తారు. ఒకవవేళ 14న కోర్ట్ సినిమాకి వెళ్లి నేను చెప్పిన అంచనాలని మ్యాచ్ కాలేదని అనిపిస్తే.. ఇంకో రెండు నెలల్లో రిలీజ్ అవుతున్న నా హిట్ 3ని ఎవరూ చూడొద్దు.”
“ఇంతకంటే బలంగా చెప్పలేను. 14న థియేటర్ కి వెళ్ళండి. చాలా హ్యాపీగా ఫీలౌతారు. సినిమా చూసినప్పుడు నాకు గొప్ప ఎక్స్ పీరియన్స్ కలిగింది. సినిమా చూసిన తర్వాత మీరే అందరికీ చెబుతారు. టీం అందరికీ కంగ్రాట్స్ అండ్ థాంక్ యూ. తెలుగు సినిమాకి గ్రేట్ కోర్ట్ రూమ్ డ్రామా ఇచ్చారు. మార్చి14న థియేటర్స్ లో కలుద్దాం” అని అన్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























