గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తన 16వ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఉప్పెన ఫేమ్ బుచ్చి బాబు సన ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు.ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ఢిల్లీ లో జరుగుతుందని సమాచారం.ఇక ఈసినిమాలో కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్ కీలక పాత్రలో నటించనున్నాడు.అందులో భాగంగా ఈరోజు తన పాత్ర తాలూకు లుక్ టెస్ట్ ను కంప్లీట్ చేశారు.త్వరలోనే అయన షూటింగ్ లో జాయిన్ కానున్నారని చిత్ర బృందం అఫీషియల్ గా ప్రకటించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక శివ రాజ్‌కుమార్ రీసెంట్ గానే క్యాన్సర్ ను జయించి ప్రస్తుతం కోలుకుంటున్నారు.ఈసినిమాలో తన రోల్ హైలైట్ కానుందట.ఇందులో మీర్జాపూర్ ఫేమ్ దివ్యేందు శర్మ షూటింగ్ ప్రతినాయకుడిపాత్రలో కనిపించనున్నాడు.సౌత్ లో ఇదే తనకు మొదటి సినిమా.రూరల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈసినిమాలో రామ్ చరణ్ సరికొత్త లుక్ లో కనిపించనుండగా తనకు జోడీగా జాన్వీ కపూర్ నటిస్తుంది.ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ ,వృద్ధి సినిమాస్ ,సుకుమార్ రైటింగ్స్ నిర్మిస్తున్నాయి.రామ్ చరణ్ బర్త్ డే మార్చి 27 న ఈసినిమా టైటిల్ ను ప్రకటించనున్నారు.
ఇక ఈసినిమా తరవాత రామ్ చరణ్ ,సుకుమార్ డైరెక్షన్ లో నటించనున్నాడు.మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనుంది.ఈఏడాది చివర్లో సెట్స్ మీదకు వెళ్లనుంది.ఇంతకుముందు వీరి కాంబినేషన్ లో వచ్చిన రంగస్థలం రామ్ చరణ్ కెరీర్ కు టర్నింగ్ పాయింట్ అయ్యింది.దాంతో ఇదే కాంబో లో రానున్న RC 17 పై భారీ అంచనాలు వున్నాయి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























