ఆల్ టైం టాప్ 4లో ది ప్యారడైజ్ గ్లింప్స్

The Paradise Glimpse gets record-breaking views on YouTube

భారీ అంచనాల మధ్య నిన్న విడుదలైన నేచురల్ స్టార్ నాని ది ప్యారడైజ్ గ్లింప్స్ సెన్సేషనల్ వ్యూస్ ను దక్కించుకుంది. 24గంటల్లో ఈ గ్లింప్స్ తెలుగులో 17.14 మిలియన్ల వ్యూస్ ను సొంతం చేసుకుంది.దాంతో టాలీవుడ్ లో 24 గంటల్లో అత్యధిక వ్యూస్ ను పొందిన నాలుగో గ్లింప్స్ గా ది ప్యారడైజ్ రికార్డు సృష్టించింది. ఓవరాల్ గా అన్ని భాషల్లో కలిపి 23 మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకుంది.ఏకంగా ఈ గ్లింప్స్ 8భాషల్లో రిలీజయ్యింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ గ్లింప్స్ చూసి టాలీవుడ్ షాక్ అయ్యింది.బోల్డ్ గా వచ్చిన ఈ గ్లింప్స్ లో నాని సరికొత్త గెటప్ లో కనిపించాడు.మొత్తానికి విడుదలకు ముందే గ్లింప్స్ తో సినిమాకు భారీ హైప్ క్రియేట్ చేశారు.రిలీజ్ రోజు భారీ ఓపెనింగ్స్ రాబట్టుకోవడం ఖాయం.నాని కెరీర్ కు ది ప్యారడైజ్ గేమ్ ఛేంజర్ కానుంది.ఈసినిమాలో డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కొత్త ప్రపంచాన్ని చూపించనున్నాడు.

సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ ఈసినిమాకు సంగీతం అందిస్తుండగా భారీ బడ్జెట్ తో దసరా నిర్మాత సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి 26న థియేటర్లలోకి రానుంది.

ఇక ప్రస్తుతం నాని, హిట్ 3 చేస్తున్నాడు. సినిమా షూటింగ్ కూడా తుది దశకు చేరుకుంది.ఈ నెలలో కంప్లీట్ కానుంది.మే 1న ఈసినిమాను థియేటర్లలోకి తీసుకురానున్నారు.ఆ తరువాత నాని ది ప్యారడైజ్ ను మొదలు పెట్టనున్నాడు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.