రాబిన్‌హుడ్ లాంటి సినిమా చేసి చాలా కాలమైంది – రాజేంద్రప్రసాద్

Actor Rajendra Prasad Shares Working Experience With Hero Nithiin in Robinhood

హీరో నితిన్ హైలీ యాంటిసిపేటెడ్ హీస్ట్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘రాబిన్‌హుడ్’. శ్రీలీల కథానాయికగా నటించింది. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ హై బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ఈ చిత్రంలో సీనియర్ నటుడు, నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ ఒక కీలక పాత్ర పోషించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన పాటలు చార్ట్ బస్టర్ హిట్ అయ్యాయి. ఈ సినిమా మార్చి 28న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపధ్యంలో రాజేంద్రప్రసాద్ విలేకరుల సమావేశంలో రాబిన్‌హుడ్ విశేషాలు పంచుకున్నారు.

రాబిన్‌హుడ్ జర్నీ ఎలా అనిపించింది?

  • సినిమా ఇండస్ట్రీకి వచ్చి 48 ఏళ్ళు అయ్యింది.
  • రాబిన్‌హుడ్ చేశాక యాక్టర్‌గా నామీద నాకు కాన్ఫిడెన్స్ లెవల్ పెరిగింది.
  • రాబిన్‌హుడ్ చూసాక నేను హీరోగా చేసిన ఎంటర్‌టైనింగ్‌ సినిమాలు, ఆనాటి రోజులు ఆడియన్స్‌కి గుర్తుకు వస్తాయి.
  • క్యారెక్టర్, పెర్ఫార్మెన్స్ పరంగా సినిమా చాలా ఎంటర్‌టైనింగ్‌గా వుంటుంది.
  • దర్శకుడు వెంకీ అద్భుతంగా రాశాడు, తీశాడు.
  • నేను హీరోగా నటించిన పాత రోజులు మళ్ళీ గుర్తుకు వచ్చాయి.
  • ఈ సినిమా, క్యారెక్టర్ పట్ల చాలా హ్యాపీగా వుంది.

రాబిన్‌హుడ్‌లో మీకు, నితిన్ గారికి మధ్య కెమిస్ట్రీ ఎలా వుంటుంది?

  • ఇందులో ఇండియాలోనే హయ్యస్ట్ సెక్యూరిటీ ఏజెన్సీ నాది.
  • నా ఏజెన్సీలో పని చేయడానికి హీరో వస్తాడు.
  • ఇంతకంటే కథ చెప్పకూడదు (నవ్వుతూ).
  • ఈ కాంబినేషన్‌లో చాలా అద్భుతంగా వుంటుంది.
  • ఇందులో నా టైమింగ్ నితిన్ ఫాలో అవ్వాలి, నితిన్ టైమింగ్ నేను ఫాలో అవ్వాలి.
  • క్యారెక్టర్స్ అలా డిజైన్ చేయబడ్డాయి.
  • మేము ఇద్దరం వెన్నెల కిశోర్‌కి దొరక్కూడదు.
  • సినిమా చూసినప్పుడు భలే గమ్మత్తుగా వుంటుంది.
  • ఇలాంటి ఎంటర్‌టైనింగ్ సినిమా చేసి చాలా కాలమయింది.
  • రాబిన్‌హుడ్ ఆడియన్స్‌కి మంచి ఫీస్ట్.
  • ‘జులాయి’ దగ్గర నుంచి 100కోట్లు దాటిన కమర్షియల్ సినిమాలు చాలా చేశాను.
  • నితిన్‌కి రాబిన్‌హుడ్ సినిమాతో స్టేచర్ మారబోతోంది.

డైరెక్టర్ వెంకీ కుడుముల గురించి?

  • వెంకీ కుడుముల చాలా బిగ్ డైరెక్టర్ అవుతారు.
  • ఈ మధ్య కాలంలో వన్ అఫ్ ది బెస్ట్ క్యారెక్టర్ రాబిన్‌హుడ్‌లో చేశాను.
  • డైరెక్టర్ వెంకీ స్పెషల్‌గా ఈ క్యారెక్టర్‌ని నా గురించి రాసుకున్నారు.
  • వర్క్ చేస్తున్నప్పుడే చాలా ఎంజాయ్ చేస్తూ చేసిన సినిమా ఇది.
  • వెంకీ, త్రివిక్రమ్ దగ్గర అసిస్టెంట్‌గా చేశారు.
  • ఆయన లక్షణాలు అన్నీ వచ్చాయి.
  • డైలాగ్‌లో మంచి పంచ్ వుంటుంది.
  • తను కథ చెప్పినప్పుడు చాలా ఎంజాయ్ చేశాను.
  • ‘జులాయి’ తర్వాత ‘సన్నాఫ్ సత్యమూర్తి, నాన్నకు ప్రేమతో, శ్రీమంతుడు, ఓ బేబీ, ఎఫ్2’ చిత్రాల్లో నా పాత్రలని ఎలా అయితే గుర్తుపెట్టుకున్నారో.. రాబిన్‌హుడ్‌లో చేసిన క్యారెక్టర్ కూడా నేను గ్యారెంటీగా గుర్తుపెట్టుకునే క్యారెక్టర్ అవుతుంది.
  • నటుడిగా ఈ జీవితం దేవుడు, ప్రేక్షకులు ఇచ్చిన గొప్ప అవకాశంగా భావిస్తున్నాను.
  • ‘లేడిస్ టైలర్, ఏప్రిల్ ఒకటి విడుదల, మిస్టర్ పెళ్ళాం, పెళ్లి పుస్తకం, ఆ ఒక్కటీ అడక్కు.. ఇలా ప్రతి సినిమా దేనికదే భిన్నంగా వుంటుంది.
  • డిఫరెంట్ క్యారెక్టర్స్ కనిపిస్తాయి. ఒకే ఏడాది హీరోగా 12 సినిమాలు రిలీజ్ చేసిన రోజులున్నాయి.
  • దాదాపు ఆ సినిమాలన్నీ మనం రిలేట్ చేసుకునే పాత్రలే.
  • అందుకే ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యానని అనుకుంటాను.
  • నాటి ప్రధాని పీవీ నరసింహారావు గారు దగ్గర నుంచి ఇప్పటికీ చాలా మంది ప్రేక్షకులు జీవితంలో ఒత్తిడి, నిరాశలో వున్నప్పుడు సరదాగా నవ్వుకోవడానికి, మనసు తేలిక అవడానికి నా సినిమాలు చూస్తుంటామని చెప్పడం ఎంతో ఆనందాన్ని ఇస్తుంది.
  • ఇప్పటికీ దర్శకులు నా కోసం ప్రత్యేకంగా పాత్రలు రాయడం నా అదృష్టం.
  • రాబిన్‌హుడ్ సినిమా చూసినప్పుడు ఆ స్పెషాలిటీ మీరు ఫీలౌతారు.

రాబిన్‌హుడ్‌లో శ్రీలీల క్యారెక్టర్ ఎలా ఉండబోతోంది?

  • శ్రీలీల చాలా మంచి సినిమాలు చేస్తోంది.
  • చాలా మెచ్యూర్ యాక్టర్‌గా కనిపించింది.
  • ఇందులో ఆమె బిహేవియర్ నాకు చాలా నచ్చింది.
  • ఇందులో ఫారిన్ నుంచి వచ్చిన తనకి సెక్యూరిటీ ఇచ్చే బాధ్యత మాది, చాలా సరదాగా వుంటుంది.

మైత్రి మూవీ మేకర్స్ గురించి?

  • శ్రీమంతుడు సినిమా నుంచి వారితో నాకు మంచి అనుబంధం వుంది.
  • సినిమా అంటే చాలా పాషన్ వున్న నిర్మాతలు.
  • వారితో కలసి పని చేయడం వండర్ ఫుల్ ఎక్స్‌పీరియన్స్.

కొత్త దర్శకులకు మీతో వర్క్ చేయడం ఎలా వుంటుంది?

  • నాకు కొత్త, పాత అని వుండవు.
  • నిజానికి కొత్త దర్శకులు నాతో వర్క్ చేయడానికి చాలా ఇష్టపడతారు.
  • అందరికంటే ముందు నేనే సెట్స్‌లో తెగ అల్లరి చేస్తాను.
  • దీంతో అందరూ చాలా కంఫర్ట్‌బుల్‌గా ఫీలౌతారు.
  • నాతో వర్క్ చేయడం చాలా ఈజీ.

కొత్తగా చేస్తున్న సినిమాలు?

  • చాలా సినిమాలు చేస్తున్నాను.
  • దాదాపు ఏడు సినిమాలు రన్నింగ్‌లో వున్నాయి.
  • మొదలు పెట్టాల్సిన సినిమాలు ఓ ఐదు వరకు వుంటాయి.

ఆల్ ది బెస్ట్..

థాంక్ యూ.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.