తన తొలి చిత్రం ‘కలర్ ఫోటో’తో జాతీయ అవార్డు గెలుచుకున్న యంగెస్ట్ డైరెక్టర్ సందీప్ రాజ్, తన అప్ కమింగ్ ప్రాజెక్ట్ మోగ్లీ 2025 తో మరో ఎమోషనల్ పవర్ ఫుల్ నెరేటివ్ ని తెరపైకి తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నారు. తన తొలి చిత్రం బబుల్‌గమ్‌లో ఇంటెన్స్ యాక్షన్ కు ప్రశంసలు అందుకున్న రోషన్ కనకాల తన వెర్సటాలిటీ ప్రజెంట్ చేసే పవర్ ఫుల్ పాత్రను పోషిస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ విజనరీ ప్రొడ్యూసర్ టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్న మోగ్లీ 2025 అద్భుతమైన ఫారెస్ట్ నేపథ్యంలో జరిగే ప్రేమకథ. సాక్షి సాగర్ మడోల్కర్ కథానాయికగా పరిచయం అవుతోంది. కాగా ప్రస్తుతం మోగ్లీ 2025 షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా మేకర్స్ 20 రోజుల క్రూషియల్ షెడ్యూల్ ని పూర్తి చేశారు.
ఈ షెడ్యూల్ లో రంపచోడవరం, మారేడుమిల్లి ఫారెస్ట్ లో రెండు మ్యాసీవ్ యాక్షన్ బ్లాక్‌లను షూట్ చేశారు. సినిమాలో ఈ యాక్షన్ సీక్వెన్స్ లు హైలెట్‌గా వుండబోతున్నాయి. ప్రతిభావంతులైన తారాగణం, టెక్నికల్ టీంతో రూపొందుతున్న మోగ్లీ 2025 సినీ ప్రేక్షకులకు ఒక గొప్ప సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందించబోతోంది.
ఈ మూవీకి ట్యాలెంటెడ్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. రామ మారుతి. ఎం. సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, కాల భైరవ సంగీతం సమకూరస్తున్నారు, కోదాటి పవన్ కళ్యాణ్ ఎడిటింగ్, కిరణ్ మామిడి ఆర్ట్ డిపార్ట్‌మెంట్‌ను పర్యవేక్షిస్తున్నారు, నటరాజ్ మాదిగొండ యాక్షన్ సన్నివేశాలకు కొరియోగ్రఫీ చేస్తున్నారు. రామ మారుతి ఎం. రాధాకృష్ణ రెడ్డి సహ రచయితలుగా ఉన్నారు. ఇక మోగ్లీ 2025 ఈ సంవత్సరం చివర్లో విడుదల కానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























