రీసెంట్ గా విడుదలై బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తున్న బాలీవుడ్ సినిమా ఛావా తెలుగులో విడుదలకానుంది.మూడు వారాల తరువాత ఈసినిమాను తెలుగులోకి తీసుకువస్తున్నారు.అందులో భాగంగా ఈసినిమా తెలుగు ట్రైలర్ ను రిలీజ్ చేశారు.డబ్బింగ్ కూడా బాగా కుదిరింది.ట్రైలర్ అయితే సినిమా చూడాలనే ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది.ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ ఈసినిమాను తెలుగు రాష్ట్రాల్లో విడుదలచేస్తుంది.ఈనెల 7న ఛావా తెలుగు వెర్షన్ రిలీజ్ కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఛావా హిందీ వెర్షన్ మూడో వారాంతంలోనూ అదిరిపోయే కలెక్షన్స్ ను రాబట్టుకుంది.శనివారం ఈసినిమా 22 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టింది. దాంతో మూడో శనివారం అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాగా రికార్డు సృష్టించింది.ఇంతకుముందు పుష్ప 2 హిందీ వెర్షన్ మూడో శనివారం 20కోట్ల నెట్ తో టాప్ లో ఉండేది. ఛావా ఆ రికార్డును బ్రేక్ చేసింది. నిన్న కూడా ఈసినిమా రికార్డు కలెక్షన్స్ ను ఖాతాలో వేసుకుంది.మొత్తం 17 రోజుల్లో ఈసినిమా 460కోట్ల నెట్ వసూళ్లను సొంతం చేసుకుంది.ప్రపంచ వ్యాప్తంగా చూస్తే 17 రోజుల్లో 600 కోట్ల గ్రాస్ మార్క్ ను దాటింది.
చారిత్రాత్మక నేపథ్యంలో మరాఠా యోధుడు శివాజీ మహారాజ్ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా వచ్చిన ఈసినిమాలో యంగ్ హీరో విక్కీ కౌశల్ శంభాజీ మహారాజ్ గా నటించగా రష్మిక మందన్న యేసుబాయి భోంస్లేగా,అక్షయ్ ఖన్నా ఔరంగజేబుగా,డయానా పెంటీ జినత్-ఉన్-నిస్సా బేగంగా,అశుతోష్ రాణా హంబిర్రావ్ మోహితేగా,దివ్య దత్తా సోయారాబాయిగా నటించారు.దినేష్ విజన్ ఈసినిమాను నిర్మించాడు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























