టిల్లు 3 డైరెక్టర్ ఫిక్స్

MAD Square Director Kalyan Shankar To Direct Siddhu Jonnalagadda's Tillu 3 Movie

స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ కెరీర్‌లో నిలిచిపోయే చిత్రాలు ‘డీజే టిల్లు, టిల్లు స్క్వేర్’. ఒకే సిరీస్ సినిమాలే అయినా వీటికి వేర్వేరు దర్శకులు దర్శకత్వం వహించారు. తొలి చిత్రాన్ని విమల్ కృష్ణ డైరెక్ట్ చేయగా, రెండవ దానికి రామ్ మల్లిక్ సారథ్యం చేసారు. దీంతో ఇప్పుడు మూడో పార్ట్ డైరెక్టర్ గురించి చర్చ సాగుతోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలో ‘టిల్లు 3’కి దర్శకత్వం వహించబోయేది ఎవరో తెలిసిపోయింది. ఈ మేరకు తాజాగా నిర్మాత సూర్యదేవర నాగవంశీ దీనిపై క్లారిటీ ఇచ్చేసారు. ఆయన నిర్మించిన మ్యాడ్ స్క్వేర్ చిత్రానికి దర్శకత్వం వహించిన కళ్యాణ్ శంకర్ టిల్లు 3ని డైరెక్ట్ చేయనున్నాడు. కాగా మ్యాడ్ మరియు టిల్లు సిరీస్ చిత్రాలను నిర్మించింది నాగవంశీయే అన్న విషయం తెలిసిందే.

కాగా టిల్లు స్క్వేర్ చిత్రం రూ.125 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సిద్దు కెరీర్ లో తొలి 100 కోట్ల సినిమాగా రికార్డ్ సృష్టించింది. ఇందులో అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటించగా.. మురళీధర్, ఆంథోనీ, సుజాత తదితరులు కీలక పాత్రలు పోషించారు. దీంతో ఇప్పుడు టిల్లు 3పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరోవైపు మ్యాడ్ బ్లాక్ బస్టర్ కావడంతో త్వరలో రిలీజ్ కాబోయే మ్యాడ్ స్క్వేర్ సినిమాపై కూడా మంచి అంచనాలే ఉన్నాయి.

ఈ క్రమంలో ఈ సినిమాకు దర్శకత్వం వహించిన కళ్యాణ్ శంకర్ టిల్లు 3కి కూడా డైరెక్షన్ వహించనుండటంతో ఆ అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. ఇదిలావుంటే, మాస్ మహారాజా రవితేజ నటించనున్న కొత్త చిత్రానికి కూడా కళ్యాణ్ శంకర్ డైరెక్షన్ చేయనున్నాడు. అలాగే వీటితోపాటు ఇంకో క్రేజీ మూవీకి కూడా ఆయన దర్శకత్వం వహించనున్నాడు. సూపర్ హీరో కథాంశం నేపథ్యంలో ఇది తెరకెక్కనున్నట్టు సమాచారం. అయితే ఈ చిత్రాలన్నీ కూడా సితార సంస్థ రూపొందిస్తున్నవే కావడం గమనార్హం.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.