టాలీవుడ్ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరోలు బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ కలిసి నటిస్తోన్న మోస్ట్ అవైటెడ్ మల్టీ స్టారర్ ‘భైరవం’. వీరి సరసన అదితి శంకర్, దివ్యా పిళ్లై, ఆనంది హీరోయిన్లుగా కనిపించనున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదల చేసిన లీడ్ యాక్టర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్స్ స్ట్రాంగ్ బజ్‌ను క్రియేట్ చేశాయి. ఇంకా ఫస్ట్ సింగిల్ ‘ఓ వెన్నెల’ చార్ట్ బస్టర్ హిట్ అయ్యింది. అలాగే రీసెంట్ గా విడుదల చేసిన మూవీ టీజర్ కూడా మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇక ఇటీవలే భైరవం నేపథ్యాన్ని, కథాంశాన్ని తెలియజేసేలా పవర్‌ఫుల్ థీమ్ సాంగ్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.
ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీకి సంబంధించి మరో కీలక అప్డేట్ పంచుకుంది చిత్ర బృందం. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ వర్క్ స్టార్ట్ అయింది. ఈ మేరకు ఈ సినిమాకు సంగీతం అందిస్తున్న మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ చరణ్ పాకాల కంపోజింగ్ చేస్తున్న వీడియోను మేకర్స్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. స్టోరీ ప్రకారం, ఈ చిత్రానికి బీజీఎమ్ కీలకం కానుంది. అందుకే శ్రీ చరణ్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్లో ఉండేలా కంపోజ్ చేస్తున్నారు.
నియో-నోయిర్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ మూవీలో ప్రముఖ తారాగణం సందడి చేస్తుండగా.. పేరొందిన సాంకేతిక సిబ్బంది పనిచేస్తున్నారు. హరి కె వేదాంతం సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. ఛోటా కె ప్రసాద్ ఎడిటర్‌గా, బ్రహ్మ కడలి ప్రొడక్షన్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు. అలాగే ఈ చిత్రానికి సత్యర్షి, తూమ్ వెంకట్ డైలాగ్స్ రాస్తున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























