నాగబంధం.. కీలక పాత్రలో అనసూయ భరద్వాజ్

Actress Anasuya Bharadwaj Plays Vital Role in Nagabandham - The Secret Treasure

టాలీవుడ్ యంగ్‌ హీరో విరాట్‌ కర్ణ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ హైలీ యాంటిసిపేటెడ్‌ పాన్‌-ఇండియా మూవీ ‘నాగబంధం’. ‘ది సీక్రెట్‌ ట్రెజర్‌’ అనే ట్యాగ్‌లైన్‌తో ‘నాగబంధం’ ఒక ఎపిక్‌ అడ్వెంచర్‌గా రూపుదిద్దుకుంటోంది. ప్యాషనేట్‌ ఫిల్మ్‌ మేకర్‌ అభిషేక్‌ నామా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం గ్రాండ్‌ స్కేల్‌లో రూపొందుతోంది. ఇప్పటికే రిలీజైన ఫస్ట్‌ లుక్‌ మంచి బజ్‌ క్రియేట్‌ చేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీకి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందింది. ఈ చిత్రంలో వెర్సటైల్ యాక్ట్రెస్ అనసూయ భరద్వాజ్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ మేరకు ఆమె, ప్రస్తుతం షూటింగ్ లో పాల్గొంటున్న సెట్స్ నుంచి ఒక ఫోటో షేర్ చేశారు. రాయల్ లుక్ లో కనిపిస్తున్న చేతులుని ప్రజెంట్ చేసే ఈ ఫోటో చాలా క్యురియాసిటీ పెంచింది.

ఇక ఈ చిత్రంలో విరాట్‌ కర్ణ సరసన నభా నటేష్, ఐశ్వర్య మీనన్ హీరోయిన్స్‌గా నటిస్తుండగా.. సీనియర్ నటుడు జగపతి బాబు, రిషభ్‌ సహానీ, జయప్రకాష్, జాన్‌ విజయ్‌, మురళీ శర్మ, అనసూయ, శరణ్య, ఈశ్వరిరావు, జాన్‌ కొక్కిన్‌, అంకిత్‌ కొయ్య, సోనియా సింగ్‌, మాథ్యూ వర్గీస్‌, జాసన్‌ షా, బి.ఎస్.అవినాష్, బేబి కియరా, కళ్యాణి, కేశవ్‌ దీపక్‌ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

పాన్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ నాగబంధం ఒక పురాణ ఇతిహాసాల నుంచి తీసుకున్న కథాంశాన్ని మిళితం చేస్తూ పద్మనాభస్వామి, పూరీ జగన్నాథ దేవాలయాల వద్ద ఇటీవల కనుగొనబడిన గుప్త నిధుల నుంచి ప్రేరణ పొంది, ఆధ్యాత్మిక సాహసోపేతమైన ఇతివృత్తాలతో వుంటుంది. ఈ పవిత్ర స్థలాలను రక్షించే నాగబంధం పురాతన ఆచారాలపై దృష్టి సారించి, భారతదేశంలోని విష్ణు దేవాలయల చుట్టూ ఉన్న రహస్యాన్ని నాగబంధంలో అద్భుతంగా ప్రజెంట్‌ చేస్తున్నారు.

అయితే ఈ చిత్రం అసాధారణమైన నిర్మాణ విలువలు, అత్యాధునిక విఎఫ్‌ఎక్స్‌ హై – ఆక్టేన్‌ అడ్వెంచర్‌కి ప్రామిస్‌ చేస్తోంది. సౌందర్‌ రాజన్‌ ఎస్‌ డీవోపీగా పనిచేస్తుండగా.. అభే సంగీతం సమకూరుస్తున్నారు. అలాగే కళ్యాణ్‌ చక్రవర్తి డైలాగ్స్‌ రాయగా, ఆర్‌సీ ప్రణవ్‌ ఎడిటింగ్ నిర్వహిస్తున్నారు. ఇంకా అశోక్‌ కుమార్‌ ప్రొడక్షన్‌ డిజైనర్‌గా బాధ్యతలు తీసుకోగా.. స్ట్రిప్ట్‌ డెవలప్‌మెంట్‌ శ్రా1, రాజీవ్‌ ఎన్‌ కృష్ణ చూసుకుంటున్నారు.

ప్రముఖ ఫిల్మ్ మేకర్ అభిషేక్‌ నామా కథ, స్క్రీన్‌ప్లే రెండింటికీ తనదైన విజన్‌ను తీసుకువస్తున్నారు. NIK స్టూడియోస్‌ ఆధ్వర్యంలో కిషోర్‌ అన్నపురెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని లక్ష్మీ ఐరా, దేవాన్ష్‌ నామా గర్వంగా సమర్పిస్తున్నారు. కాగా నాగబంధం 2025లో తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఏకకాలంలో పాన్‌ ఇండియా లెవల్‌లో విడుదల కానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.