కోర్ట్ ట్రైలర్ అప్‌డేట్

COURT - State vs A Nobody Trailer Update

నేచురల్ స్టార్ నాని నిర్మాణ సారథ్యంలోని వాల్ పోస్టర్ సినిమా సమర్పిస్తున్న తాజా చిత్రం ‘కోర్ట్’ – స్టేట్ వర్సెస్ ఎ నోబడీ’. యువ నటుడు ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు రామ్ జగదీష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం మార్చి 14న హోలీ పండుగ సందర్భంగా విడుదల కానుంది. దీంతో మేకర్స్ మూవీ ప్రమోషన్స్‌పై దృష్టి సారించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దీనిలో భాగంగా ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేసింది. ఇటీవల వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ మూవీ నుంచి విడుదలైన ఫస్ట్ సింగిల్ ‘ప్రేమలో’ ఫస్ట్ లవ్ మంచి రెస్పాన్స్ అందుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం నుంచి సాలిడ్ అప్‌డేట్‌ అందించింది చిత్ర యూనిట్.

త్వరలో కోర్ట్ థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు మార్చి 1న.. అనగా రేపు ఈ ట్రైలర్‌ లాంచ్ కానున్నట్టు సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. కాగా ఈ చిత్రంలో శివాజీ, సాయి కుమార్, రోహిణి, హర్షవర్ధన్, శుభలేఖ సుధాకర్, రాజశేఖర్ అనింగి, సురభి ప్రభావతి, విశిక, వడ్లమణి శ్రీనివాస్ వంటి ఇతర ప్రముఖ తారాగణం కీలక పాత్రలు పోషిస్తోంది.

ఇక విజయ్ బుల్గానిన్ సంగీతం సమకూరుస్తోన్న ఈ చిత్రానికి దినేష్ పురుషోత్తమన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. విఠల్ కోసనం ఆర్ట్ డైరెక్టర్ కాగా, కార్తీక శ్రీనివాస్ ఆర్ ఎడిటింగ్‌ను నిర్వహిస్తున్నారు. ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లేను కార్తికేయ శ్రీనివాస్, వంశీధర్ సిరిగిరి రాశారు. ప్రశాంతి తిపిర్నేని నిర్మించగా.. దీప్తి గంటా సహ నిర్మాతగా వ్యవహరించారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.