మజాకా సీక్వెల్ ఉంది, టైటిల్ ఇదే..!

Producer Rajesh Danda Reveals Interesting Facts About Mazaka

పీపుల్స్ స్టార్ సందీప్ కిషన్ ల్యాండ్‌మార్క్ 30వ సినిమా ‘మజాకా’కి ధమాకా మేకర్ త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్య మూవీస్ బ్యానర్స్‌పై రాజేష్ దండా నిర్మిస్తున్నారు. బాలాజీ గుత్తా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ మాస్ ఎంటర్‌టైనర్‌లో రీతు వర్మ హీరోయిన్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

‘మన్మధుడు’ ఫేమ్ అన్షు, రావు రమేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్, సాంగ్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఈ హైలీ ఎంటర్‌టైనింగ్ మూవీ శివరాత్రి కానుకగా ఫిబ్రవరి 26న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత రాజేష్ దండా విలేకరుల సమావేశంలో సినిమా విశేషాల్ని పంచుకున్నారు.

బచ్చలమల్లి తర్వాత మీ నుంచి వస్తున్న ‘మజాకా’పై మీ అంచనాలు ఏమిటి?

  • ఒక డిఫరెంట్ సినిమా చేయాలని బచ్చలమల్లి చేశాను.
  • మజాకా మంచి ఎంటర్‌టైనర్‌, ఫ్యామిలీ సినిమా.
  • డైరెక్టర్ త్రినాధ్ రావు, రైటర్ ప్రసన్న గారి స్టయిల్‌లో వుండే మాస్ ఎంటర్‌టైనర్‌.
  • ఇకపై కూడా మంచి ఎంటర్‌టైన్‌మెంట్ వున్న సినిమాలనే చేస్తాను.

మజాకా పాటలు ట్రైలర్ పెద్ద గ్యాప్ లేకుండా రిలీజ్ చేశారు కదా.. దీని వలన రీచ్‌కి ఏమైనా ఇబ్బంది ఉందా?

  • టీజర్ ముందే రిలీజ్ చేశాం. అది జనాల్లో వుంది.
  • ట్రైలర్‌కి కంటే ముందు ‘సొమ్మసిల్లి’ పాట రిలీజ్ చేశాం, అది టాప్ ట్రెండింగ్‌లో వుంది.
  • మాకు రిలీజ్ డేట్ ముఖ్యం. దాని కోసం అందరం కష్టపడి పని చేశాం.

లైవ్ షూటింగ్ ఇవ్వాలనే ఐడియా ఎవరిది?

  • అనిల్ గారిది. రిలీజ్ డేట్‌కి తక్కువ టైం వుంది.
  • ఏదైనా కొత్తగా ప్లాన్ చేయాలనుకున్నప్పుడు అనిల్ గారు ఆ ఆలోచన చెప్పారు.
  • దానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది.

మజాకా పెయిడ్ ప్రిమియర్స్ ప్లాన్ చేస్తున్నారా?

  • ప్లానింగ్‌లో వున్నాం.
  • ముందురోజు పెయిడ్ ప్రిమియర్ వేయాలని ప్లాన్ చేస్తున్నాం.

ఆల్రెడీ సినిమా చూసుంటారు కదా.. ఎలా అనిపిస్తోంది?

  • ఖచ్చితంగా చాలా మంచి సినిమా అవుతుంది.
  • మంచి ఎంటర్‌టైన్‌మెంట్, ఫ్యామిలీ ఎమోషన్ వున్న సినిమా.
  • ఇంటర్వెల్‌కి మంచి ట్విస్ట్ వుంటుంది.
  • అది సెకండ్ హాఫ్‌ని ఎలా లీడ్ చేస్తోందో చాలా ఇంట్రస్టింగ్‌గా వుంటుంది.
  • సందీప్-రావు రమేష్ సీన్స్, సందీప్-రీతు లవ్ స్టొరీ, అలాగే రావు రమేష్-అన్షు ట్రాక్ కూడా చాలా బావుంటుంది.
  • సందీప్‌కి ‘భైరవ కోన..’ కంటే బెటర్ సినిమా అవుతుంది.

ఈ సినిమా బిజినెస్ విషయంలో హ్యాపీగా వున్నారా?

  • చాలా హ్యాపీ. ఈ సినిమాని ప్రాఫిట్స్‌లో రిలీజ్ చేస్తున్నాను.
  • సందీప్ కిషన్ గారి కెరీర్‌లో ఇది బిగ్గెస్ట్ రిలీజ్.

రావు రమేష్ గారి ఛాయిస్ ఎవరిది?

  • డైరెక్టర్ గారు ఫాదర్ రోల్‌కి ముందు నుంచి రావు రమేష్ గారిని అనుకున్నారు.
  • ఆయన పెర్ఫార్మెన్స్ అందరినీ ఆకట్టుకుంటుంది.
  • ఇందులో కామెడీ చాలా ఫ్రెష్‌గా వుంటుంది.

టైటిల్ జస్టిఫికేషన్ ఏమిటి?

  • మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌ వున్న టైటిల్ పెట్టాలని అనుకున్నాం.
  • ఒక సెలబ్రేషన్ వైబ్ వున్న సినిమా ఇది. మజాకా టైటిల్ పర్ఫెక్ట్ అనిపించింది.

త్రినాథ్ రావు నక్కిన గారితో వర్క్ చేయడం గురించి?

  • ఆయనతో వర్క్ చేయడం వండర్ ఫుల్ ఎక్స్‌పీరియన్స్.
  • సినిమాని అద్భుతంగా తీశారు. ఆయనతో మరో సినిమా చేయాలని వుంది.
  • ఇదే సినిమాకి సీక్వెల్ చేయాలని ఆలోచన వుంది.
  • సినిమా ఎండ్‌లో ‘డబుల్ మజాకా’ అనే టైటిల్ కూడా వేశాం.

మజాకాలో మెసేజ్ ఉందా?

  • ఇందులో ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు మంచి మెసేజ్ కూడా వుంది.
  • ఇద్దరు బ్యాచిలర్స్ వాళ్ళ ఇంట్లో ఒక ఫ్యామిలీ ఫోటో పెట్టుకోవాలని తపన పడతారు.
  • అది సినిమాలో బ్యూటీఫుల్ ఎమోషన్.

మజాకా సినిమాని ఆల్రెడీ చూసిన వారి రెస్పాన్స్ ఏమిటి?

  • నా ఫ్రెండ్స్, కొంతమంది నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్‌కి సినిమా చూపించాం.
  • ఎంటర్‌టైన్‌మెంట్, ఎమోషన్ చాలా బావుందని చెప్పారు. పాటలు చాలా ఎంజాయ్ చేశారు.
  • నేను ఏదైతే నమ్మానో అది వర్క్ అవుట్ అయ్యింది.

సామజవరగమన సీక్వెల్ ఎప్పుడు?

  • మా రైటర్ భాను రవితేజ గారితో సినిమా చేస్తున్నారు.
  • అది కంప్లీట్ అయ్యాక కథ రెడీ చేయాలి.

అనిల్ గారితో మీ కొలాబరేషన్ ఎలా వుంది?

  • నెక్స్ట్ ఇయర్ ఓ పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నాం.
  • ఈ ఇయర్ లోనే అనౌన్స్ మెంట్ వుంటుంది.

మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్?

  • సంయుక్తతో ఓ ప్రాజెక్ట్ జరుగుతోంది.
  • అలాగే కిరణ్ అబ్బవరంతో సినిమా షూటింగ్ జరుగుతోంది.

ఆల్ ది బెస్ట్..

థాంక్ యూ.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.