నటీనటులు : పవిష్, అనికా సురేంద్రన్ ,మాథ్యూ థామస్ ,ప్రియా ప్రకాష్ వారియర్ ,శరత్ కుమార్
ఎడిటింగ్ : ప్రసన్న జికె
సినిమాటోగ్రఫీ : లియోన్ బ్రిట్టో
సంగీతం : జివి ప్రకాష్ కుమార్
దర్శకత్వం : ధనుష్
నిర్మాతలు : కస్తూరి రాజా ,విజయలక్ష్మి కస్తూరి రాజా
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తమిళ హీరో ధనుష్ డైరెక్షన్ లో తెరకెక్కిన చిత్రం జాబిలమ్మ నీకు అంత కోపమా.ఇందులో నుండి వచ్చిన గోల్డెన్ స్పారో సాంగ్ సెన్సేషనల్ రెస్పాన్స్ తెచ్చుకోవడం అలాగే ట్రైలర్ ప్రామిసింగ్ గా ఉండడంతో తమిళం తోపాటు తెలుగులోనూ ఈసినిమాకు హైప్ వచ్చింది.యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా ఈ రోజే థియేటర్లలోకి వచ్చింది.మరి ఈసినిమా రివ్యూ ఏంటో చూద్దాం.
కథ :
ప్రభు ( పవిష్) హోటల్ మేనేజ్మెంట్ చేసి చెఫ్ గా స్థిరపడాలనుకుంటాడు.కాలేజ్ లో నీల ( అనికా )ను చూసి ఇష్టపడుతాడు.నీల కూడా తనను ఇష్ట పడుతుంది. కానీ నీలా బాగా రిచ్ , ప్రభుది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. దాంతో నీలా తండ్రి వీరి పెళ్ళికి ఒప్పుకోడు. ఈనేపథ్యంలో ఇద్దరికి బ్రేక్ అప్ అవుతుంది. ఇదిలావుండగా ప్రభుకి ,ప్రీతి (ప్రియా ప్రకాష్) తో పెళ్లి చూపులవుతాయి. ఇద్దరు కొంత కాలం ప్రయాణం చేసి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు.ఈ మధ్యలో ప్రభుకి నీలా నుండి పెళ్ళికి ఆహ్వాన లేఖ అందుతుంది.మరి ఆతరువాత ఏమైంది? నీల పెళ్ళికి వెళ్లాడా ?చివరికి ప్రభు జీవితం ఎలాంటి టర్న్ తీసుకుంది? అనేది మిగితా కథ.
విశ్లేషణ :
ట్రైలర్ లో ధనుష్ ముందు గానే చెప్పాడు ఇది సాధారణ కథే అని.దాంతో పెద్దగా అంచనాలు పెట్టుకోకుండా వెళతారు సినిమాకి.ఇది ఒకందుకు అడ్వాంటేజ్ అయ్యింది. ఎందుకంటే జాబిలమ్మ రొటీన్ స్టోరీ.పెద్దింటి అమ్మాయి, మిడిల్ క్లాస్ అబ్బాయి ప్రేమించుకోవడం ఇంట్లో ఒప్పుకోకపోవడం, ఆ తరువాత విడిపోవడం చివరికి మళ్లీ కలవడం కథగా చూస్తే ఇంతే. అయితే డైరెక్టర్ గా ధనుష్ చేసిన మ్యాజిక్ తో ఈసినిమా ఎక్కడా బోర్ కొట్టకుండా ఆద్యంతం ఎంటర్టైన్ చేస్తూ సూపర్ అనిపిస్తుంది. స్క్రీన్ ప్లే ఈసినిమాకు ప్రధాన బలం.ప్రభు తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ నీల పెళ్లి కార్డు అందుకోవడం నుండి కథ స్టార్ట్ అవుతుంది. హీరో, హీరోయిన్ లవ్ ట్రాక్ తో పాటు సమాంతరంగా స్నేహితుల లవ్ ట్రాక్ నడిపించడం సినిమాకు చాలా హెల్ఫ్ అయ్యింది.ఇందులో హీరో స్నేహితుడు చేసే కామెడీ హైలైట్ అని చెప్పొచ్చు.ఇంటర్వెల్ కు ముందు వచ్చే సన్నివేశాలతో సెకండ్ హాఫ్ పై అంచనాలు పెరుగుతాయి.
ఇక సెకండ్ హాఫ్ లో మాజీ ప్రేయసి పెళ్ళికి హీరో, అతని ఫ్రెండ్ రాజేష్ వెళ్లడం అక్కడి నుండి కొత్త పాత్రలు ఎంట్రీ ఇవ్వడం అందులో నుండి కూడా ఫుల్ ఫన్ జనరేట్ అయ్యింది .క్లైమాక్స్ ను కూడా బాగా డీల్ చేశాడు ధనుష్.చివర్లో సెకండ్ పార్ట్ కూడా లీడ్ ఇచ్చాడు. పాటలు స్క్రీన్ మీద చాలా బాగా అనిపించాయి.గోల్డెన్ స్పారో విజువల్ గా కుడా అదిరిపోయింది.ఓవరాల్ గా జాబిలమ్మ నీకు అంత కోపమా గత ఏడాది వచ్చిన ప్రేమలు తరహాలో నీట్ లవ్ స్టోరీ తో రాగా అదే కోవలో ఎంటర్టైన్ చేస్తుంది.
నటీనటుల విషయానికి వస్తే ప్రభు పాత్రలో పవిష్ బాగా నటించాడు.ధనుష్ మేనల్లుడు అయిన పవిష్ అక్కడక్కడా ధనుష్ ను గుర్తుకు తెచ్చాడు.పక్కింటి అబ్బాయి గా తన నటన సహజంగా వుంది.ముందు ముందు ఇలాగే మంచి స్టోరీ లు పడితే హీరోగా మంచి భవిష్యత్తు ఉంటుంది.ఇక పవిష్ తరువాత మాథ్యూ థామస్ రోల్ హైలైట్ అయ్యింది.ప్రభు ఫ్రెండ్ గా వన్ లైనర్స్ తో బాగా నవ్వించాడు.అనికా సురేంద్రన్ చూడడానికి చాలా క్యూట్ గా అనిపిస్తూ నటన తో మెప్పించింది. ప్రియా ప్రకాష్ వారియర్ ది అతిథి పాత్రే .రమ్య రంగనాథ్ కు మంచి పాత్ర దొరికింది.సీనియర్స్ శరత్ కుమార్ ,శరణ్య ,ఆడుకాలం నరేన్ తమ అనుభవం చూపించారు.
టెక్నికల్ గా సినిమా ఉన్నంతగా వుంది. డైరెక్టర్ గా ధనుష్ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాడు.రొటీన్ స్టోరీని యూత్ కి నచ్చేలా తెర మీదకు తీసుకువచ్చాడు. ఇక సినిమాటోగ్రఫీ రిచ్ గా వుంది.జీవీ ప్రకాష్ అందించిన సంగీతం ,బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమా కు ప్లస్.ఎడిటింగ్ షార్ప్ గా వుంది.ధనుష్ సొంత ప్రొడక్షన్ వండర్ బార్ ఫిల్మ్స్ ఈసినిమాను చాలా క్వాలిటీతో నిర్మించింది.
ఓవరాల్ గా యూత్ ను టార్గెట్ చేసుకొని వచ్చిన ఈ జాబిలమ్మ నీకు అంత కోపమా లో కామెడీ , డైరెక్షన్ , పవిష్ ,మాథ్యూ థామస్ నటన హైలైట్ అయ్యాయి. ఫ్రెండ్స్ తమ గ్యాంగ్ తో వెళితే ఈసినిమాను బాగా ఎంజాయ్ చేస్తారు.ఒక్క ముక్కలో చెప్పాలంటే ట్రైలర్ లో ధనుష్ చెప్పినట్లు జాలిగా రండి జాలిగా వెళ్ళండి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























