మిస్టర్ బచ్చన్ తో హీరోయిన్ గా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది భాగ్య శ్రీ బోర్సే.ఈ సినిమా రిజల్ట్ పక్కన పడితే తన యాక్టింగ్ ,గ్లామర్ తో యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకుంది.ఇక ఈహీరోయిన్ ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తుంది.అందులో పాన్ ఇండియా మూవీ కాంత ఒకటి. ఇందులో మలయాళం స్టార్ దుల్కర్ సల్మాన్ హీరో గా నటిస్తుండగా తమిళ దర్శకుడు సెల్వమణి సెల్వరాజ్ డైరెక్ట్ చేస్తున్నాడు.షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతుంది.ఇక ఈసినిమా నుండి రీసెంట్ గా దుల్కర్ సల్మాన్ లుక్ రిలీజ్ కాగా తాజాగా భాగ్య శ్రీ ఫస్ట్ లుక్ ను విడుదలచేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో తను ట్రెడిషనల్ గెటప్ లో కనిపించింది.1950 బ్యాక్ డ్రాప్ లో పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈసినిమాలో సముద్రఖని కీలక పాత్రలో నటిస్తుండగా ప్రముఖ తెలుగు నటుడు రానా దగ్గుబాటి ఓ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.దుల్కర్ తో కలిసి రానా ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.ఈఏడాది ద్వితీయార్థంలో విడుదలచేసేలా సన్నాహాలు చేస్తున్నారు.
ఇక భాగ్య శ్రీ ఈసినిమాతో పాటు ప్రస్తుతం తెలుగులో రామ్ 22 వ సినిమా లో కూడా నటిస్తుంది.మహేష్ బాబు ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది.వివేక్ -మెర్విన్ సంగీతం అందిస్తున్నారు.ఈసినిమా కూడా ఈఏడాది ద్వితీయార్థంలోనే విడుదలకానుంది.మరి ఈరెండు సినిమాలు భాగ్య శ్రీ బోర్సే ఎలాంటి రిజల్ట్ ఇస్తాయో చూడాలి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























