ఇది వెంకటేష్ విక్టరీ

Director K Raghavendra Rao Praises Victory Venkatesh For Sankranthiki Vasthunam Success

విక్టరీ వెంకటేష్, బ్లాక్ బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి, మోస్ట్ సక్సెస్ ఫుల్ బ్యానర్ శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పొంగల్ బ్లాక్ బస్టర్ ‘సంక్రాంతికి వస్తున్నాం’. దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్‌గా నటించారు. సెన్సేషనల్ కంపోజర్ భీమ్స్ సిసిరోలియో చార్ట్ బస్టర్ మ్యూజిక్ ఇచ్చారు. జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అందరినీ అద్భుతంగా అలరించి సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ క్రమంలో అత్యధిక వసూళ్ళు సాధించిన మొదటి తెలుగు రిజినల్ చిత్రంగా చరిత్ర సృష్టించింది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ తాజాగా విక్టరీ వేడుకని గ్రాండ్‌గా నిర్వహించింది. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఈ వేడుకుకు ముఖ్య అతిధిగా హాజరవగా.. డైరెక్టర్ హరీష్ శంకర్, వశిష్ట, వంశీ పైడిపల్లి తదితరులు స్పెషల్ గెస్ట్ లుగా పాల్గొన్నారు. ఈ వేడుకలో చిత్ర యూనిట్‌తో పాటు మూవీ ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్‌కి నిర్మాతలు షీల్డ్స్ అందించారు.

ఈ సందర్భంగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు మాట్లాడుతూ.. “ఈ సినిమాని వెంకటేష్ క్యారెక్టర్‌లో వుండి చూశాను. హీరోయిన్స్ కోసం ఎక్కువ ఎంజాయ్ చేశాను (నవ్వుతూ). భీమ్స్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. ఇది వెంకటేష్ విక్టరీ. దిల్ రాజు, అనిల్ కాంబినేషన్ అన్ని హిట్స్. ఏ ఫర్ అనిల్. ఈ సినిమాతో అంతులేని ఆనందం ఇచ్చే అనిల్ అయ్యాడు. అనిల్ ఇలాంటి వినోదాత్మక సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను” అని అన్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.