విక్టరీ వెంకటేష్, బ్లాక్ బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి, మోస్ట్ సక్సెస్ ఫుల్ బ్యానర్ శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పొంగల్ బ్లాక్ బస్టర్ ‘సంక్రాంతికి వస్తున్నాం’. దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్‌గా నటించారు. సెన్సేషనల్ కంపోజర్ భీమ్స్ సిసిరోలియో చార్ట్ బస్టర్ మ్యూజిక్ ఇచ్చారు. జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అందరినీ అద్భుతంగా అలరించి సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ క్రమంలో అత్యధిక వసూళ్ళు సాధించిన మొదటి తెలుగు రిజినల్ చిత్రంగా చరిత్ర సృష్టించింది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ తాజాగా విక్టరీ వేడుకని గ్రాండ్‌గా నిర్వహించింది. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఈ వేడుకుకు ముఖ్య అతిధిగా హాజరవగా.. డైరెక్టర్ హరీష్ శంకర్, వశిష్ట, వంశీ పైడిపల్లి తదితరులు స్పెషల్ గెస్ట్ లుగా పాల్గొన్నారు. ఈ వేడుకలో చిత్ర యూనిట్‌తో పాటు మూవీ ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్‌కి నిర్మాతలు షీల్డ్స్ అందించారు.
ఇక ఈ విక్టరీ వేడుకలో హీరో వెంకటేష్ మాట్లాడుతూ.. “అందరికీ థాంక్ యూ. మీరంతా ఈ వేడుకకు రావాడం చాలా సంతోషంగా వుంది. ఇండస్ట్రీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ని సెలబ్రేట్ చేసుకోవడం ఆనందంగా వుంది. ఓ మంచి దేవుడా.. నేను అడగకుండానే కలియుగ పాండవులు సినిమా ఇచ్చావు. నేను అడగకుండానే చాలా హిట్లు ఇచ్చావు. చంటి లాంటి సినిమా ఇచ్చి పెద్ద బ్లాక్ బస్టర్ చేశావు (నవ్వుతూ).. ప్రేమించుకుందాం రా, బొబ్బిలిరాజా, సీతమ్మవాకిట్లో, గణేష్, లక్ష్మీ, తులసి, రాజా’ ఇలా ఎన్నో ఇచ్చావు.”
“2000లో మళ్ళీ ఒక ఇండస్ట్రీ హిట్ ‘కలిసుందాం రా’ ఇచ్చావ్. 2025లో ఏం ఆడకుండా సైలెంట్ గా ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చావు. ఇది కలా నిజమా తెలియడం లేదు. అభిమానులు ప్రేక్షకులు ఇండస్ట్రీలో వున్నవారంతా కోరుకోవడం వలనే ఇది సాధ్యపడిందని భావిస్తున్నాను. ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చిన అందరికీ థాంక్ యూ. ఈ సినిమా బిగినింగ్ నుంచి చాలా ఎంజాయ్ చేశాను.”
“మా గురువు గారు రాఘవేంద్రరావు మంచి ఫ్యామిలీ ఫిల్మ్ చేయ్ పెద్ద హిట్ అవుతుందని చెప్పేవారు. ఆయన నమ్మకం నిజమైంది. నా ఫ్యాన్స్ ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాను చాలా గొప్పగా ఆదరించారు. మీ ప్రేమ అభిమానం ఎప్పుడూ కావాలి. పదేళ్ళుగా సినిమా చూడని ఆడియన్స్ కూడా థియేటర్స్‌కి వెళ్లి ఈ సినిమా చూడటం చాలా ఆనందాన్ని ఇచ్చింది. అనిల్ అద్భుతమైన పనితీరు కనబరిచాడు. 2027లో మళ్ళీ సంక్రాంతికి వస్తాం. రికార్డులు కాదు.. మంచి ఎంటర్ టైన్మెంట్ ఫిలిమ్స్ తో ఆడియన్స్ ఎంజాయ్ చేసేలా చూడటం నాకు ఇష్టం. అందరికీ థాంక్ యూ” అని అన్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























