తండేల్‌ని పైరసీ చేస్తే.. జైలుకే – అల్లు అరవింద్

Producer Allu Aravind Serious Warning Against Thandel Piracy

”వాట్సాప్‌, టెలిగ్రామ్‌ గ్రూప్‌ అడ్మిన్‌లకు ఇదే నా హెచ్చరిక. అడ్మిన్లు జాగ్రత్తగా ఉండండి. మీరు జైలు వెళ్లే అవకాశం ఉంది. మేము పట్టుదలతో ఉన్నాం. పైరసీ పెద్ద క్రైమ్‌. ఇప్పుడు సైబర్‌ సెల్స్‌ బాగా పనిచేస్తున్నాయి. ఇప్పుడు మిమ్మల్ని పట్టుకోవడం కూడా తేలిక. నిన్న ఆర్టీసీ బస్సుల్లో సినిమా పైరసీ ప్రింట్‌ ప్రదర్శించడం డ్రైవర్ అమాయకత్వం” అని అన్నారు నిర్మాత అల్లు అరవింద్. తాజాగా ఆయన సమర్పణలో గీత ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు నిర్మించిన ‘తండేల్’ పైరసీకి గురైన సందర్భంగా ఈ విధమైన హెచ్చరికలు చేసారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

యువ సామ్రాట్ నాగచైతన్య, సాయిపల్లవి జంటగా చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. అయితే కొందరు ఈ సినిమాను పైరసీ చేసి ఆన్‌లైన్‌లో పెట్టారు. అలాగే ఏపీఎస్‌ ఆర్టీసీకి చెందిన ఒక బస్సులోనూ దీనిని ప్రదర్శించారు. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాతలు బన్నీవాసు, సమర్పకులు అల్లు అరవింద్‌ విలేకరుల నిర్వహించారు.

ఈ ప్రెస్ మీట్‌లో నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. మీ అందరి సహకారంతో తండేల్ సినిమా సినిమా పెద్ద సూపర్ హిట్ అయింది. మా టీమ్ అంతా కలిసి ఆంధ్రాలో సక్సెస్ టూర్ చేస్తున్నారు. ప్రజల నుంచి చాలా అద్భుతమైనటువంటి స్పందన వస్తుంది. ఇవాళ కలవడానికి ముఖ్య ఉద్దేశం పైరసీ. నిర్మాతలు, ఫిల్మ్ ఛాంబర్, ఓటీటీ చర్యల వల్ల కొన్ని సంవత్సరాలుగా సినిమా పైరసీ ఆగింది.”

“అయితే రెండు నెలల నుంచి మళ్లీ పైరసీ రాక్షసి పడగ విప్పి నాట్యం ఆడుతోంది. మొన్న దిల్ రాజు గారి సినిమాని ఇలాగే ఆన్‌లైన్‌లో విడుదల చేశారు. చాలా ప్రయత్నాలు చేసి, లింక్‌లు తొలగించాం. పైరసీపై పోరాటం చేసేందుకు ఫిల్మ్‌ ఛాంబర్‌లో సెల్ ఏర్పాటు చేశాం. వాళ్లు పగలూ రాత్రి పైరసీ నియంత్రణకు పనిచేస్తూ ఉంటారు. సమస్య ఏంటంటే, చాలా మంచి ప్రింట్‌ ఎక్కువగా వచ్చేస్తోంది. వాట్సప్ గ్రూపుల్లో లింకులను ఫార్వర్డ్ చేస్తున్నారు.”

“ఇలా చేస్తున్న వాట్సప్, టెలిగ్రామ్ గ్రూప్‌ల అడ్మిన్‌లను గుర్తించాం. వారిని సమాచారాన్ని సైబర్‌ క్రైమ్‌ దృష్టికి తీసుకెళ్లాం. వారందనినీ అరెస్ట్‌ చేయిస్తాం. వాట్సాప్‌, టెలిగ్రామ్‌ గ్రూప్‌ అడ్మిన్‌లకు ఇదే నా హెచ్చరిక. అడ్మిన్లు జాగ్రత్తగా ఉండండి. మీరు జైలు వెళ్లే అవకాశం ఉంది. మేము పట్టుదలతో ఉన్నాం. ఇదొక క్రైమ్‌. ఇప్పుడు సైబర్‌ సెల్స్‌ బాగా పనిచేస్తున్నాయి.”

“ఇప్పుడు మిమ్మల్ని పట్టుకోవడం కూడా తేలిక. కొంతమంది వెబ్‌సైట్స్‌లోనూ పెడుతున్నారు. నిన్న ఆర్టీసీ బస్సుల్లో సినిమా పైరసీ ప్రింట్‌ ప్రదర్శించడం డ్రైవర్ అమాయకత్వం. సినిమా సక్సెస్ కావడనికి మీడియా వారు ఎంత సహకరించారో పైరసీని అరికట్టడానికి కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. సినిమా సక్సెస్‌ను ఆస్వాదించే సమయంలో ఇదొక ప్రతిబంధకం అయింది. దయచేసి మీరంతా సహకరించాలని కోరుతున్నాను” అని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.