స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ రొమాంటిక్ కామెడీ మూవీ ‘కృష్ణ అండ్ హిజ్ లీల’. 2020లో కరోనా మహమ్మారి సమయంలో ఓటీటీలో నేరుగా విడుదలైన ఈ సినిమా ఇన్స్టంట్ హిట్ అయింది. రవికాంత్ పెరెపు దర్శకత్వంలో రానా దగ్గుబాటి, సంజయ్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం లవ్ స్టొరీ పై ఒక రిఫ్రెషింగ్ టేక్. ఇందులో శ్రద్ధా శ్రీనాథ్, సీరత్ కపూర్, షాలిని వడ్నికట్టి కీలక పాత్రల్లో నటించారు. ప్రముఖ నటుడు రానా దగ్గుబాటి ఈ పాపులర్ చిత్రాన్ని త్వరలో థియేటర్లలో విడుదల చేయనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
డిజిటల్ లో మాత్రమే విడుదలైన ఈ చిత్రం ప్రేమికుల రోజు ఫిబ్రవరి 14న కొత్త ట్విస్ట్‌తో థియేటర్లలోకి వస్తుంది. ఈ సినిమా టైటిల్‌ను ‘ఇట్స్ కాంప్లికేటెడ్’గా మార్చారు. ఈ కొత్త టైటిల్ మరింత ఆసక్తిని జోడించడమే కాకుండా, సినిమా కంటెంట్ కి పర్ఫెక్ట్ గా యాప్ట్ అయ్యింది. ఇప్పటికే విడుదలైన అనౌన్స్ మెంట్ వీడియో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్ ప్రెస్ మీట్ నిర్వహించారు.
ఈ సందర్భంగా హీరో, చిత్ర నిర్మాత రానా దగ్గుబాటి మాట్లాడుతూ.. “ఇట్స్ కాంప్లికేటెడ్.. ప్రతి మనిషి జీవితంలో ఎదో కాంప్లికేషన్ వుంటుంది. నా జీవితంలో డైరెక్టర్ రవికాంత్, తర్వాత సిద్దు కాంప్లికేటెడ్ (నవ్వుతూ). రవికాంత్ చెప్పిన కథ మనసుకు చాలా దగ్గరగా వుంది. అందరి జీవితంలో అది జరుగుతుంది. కానీ దాని గురించి ఎవరూ మాట్లాడరు. ఈ సినిమాని థియేటర్స్ లో రిలీజ్ చేయడం చాలా ఆనందంగా వుంది” అని చెప్పారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. “నిజానికి సిద్ధు, రవికాంత్ తో మరో సినిమా చేయాలని వుంది. ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ చేస్తేగానీ కొత్త చిత్రం చేయనన్నారు. నాకు మరో ఆప్షన్ లేక ఇక్కడున్నా (నవ్వుతూ). చాలా ప్రేమతో ఈ సినిమా రిలీజ్ చేస్తున్నాము. ఈ సినిమా థీం చాలా ఫ్రెష్ గా వుంటుంది. బిగ్ స్క్రీన్స్ లో ఆడియన్స్ రియాక్షన్ చూడాలనే ఎక్సయిట్మెంట్ వుంది” అని అన్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























