‘రణం’ మూవీతో దర్శకుడుగా సత్తా చాటిన అమ్మ రాజశేఖర్ మరోసారి అద్భుతమైన చిత్రంతో వస్తున్నాడు. ‘తల’ అనే టైటిల్ తో రూపొందుతోన్న ఈ చిత్రంతో అమ్మ రాజశేఖర్ తనయుడు అమ్మ రాగిన్ రాజ్ హీరోగా పరిచయం అవుతుండటం విశేషం. ఈ నెల 14న వాలెంటైన్స్ డే సందర్భంగా ‘తల’ను విడుదల చేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఈ చిత్రాన్ని ‘వయొలెంట్ వాలెంటైన్’ అనే పేరుతో ప్రమోషన్స్ చేస్తూ విడుదల చేయబోతుండటం విశేషం. ఈ చిత్ర ట్రైలర్ కు తెలుగులో అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ మధ్య కాలంలో ఇంత మంచి ట్రైలర్ రాలేదు అనే మాట ఇండస్ట్రీ నుంచి కూడా వినిపించింది.
ఇక తాజాగా ఈ మూవీ తమిళ్ ట్రైలర్ ను వెర్సటైల్ ప్యాన్ ఇండియా యాక్టర్ విజయ్ సేతుపతి చేతల మీదుగా విడుదల చేశారు. ఈ ట్రైలర్ ను చూసిన విజయ్ సేతుపతి సైతం చాలా చాలా ఇంప్రెస్ అయ్యారు. ఓ స్టార్ హీరో రేంజ్ లో కనిపిస్తోంది మూవీ అని ప్రశంసించారు. తమిళ్ లో ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలని ఆకాంక్షించారు.
ఇలాంటి మూవీతో డెబ్యూ ఇవ్వడం అనేది ఖచ్చితంగా రాగిన్ రాజ్ కు చాలా పెద్ద కెరీర్ ను ఇస్తుందని కితాబునిచ్చాడు. అయితే విజయ్ సేతుపతి వంటి వారి నుంచి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ రావడంతో బిజినెస్ పరంగానూ తలా ఊహించిన దానికంటే చాలా ఫ్యాన్సీగా వెళుతోంది. అందుకు కారణం ఈ మూవీ కంటెంట్ లో సూపర్ హిట్ గ్యారెంటీ అనే దమ్ము కనిపిస్తోందనే మాటలు బలంగా వినిపిస్తుండటమే.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























