సంక్రాంతికి వస్తున్నాం.. నా కెరీర్‌లో ఓ మిరాకిల్

Sankranthiki Vasthunam is a Miracle in My Career, Says Director Anil Ravipudi

విక్టరీ వెంకటేష్, బ్లాక్ బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి, మోస్ట్ సక్సెస్ ఫుల్ బ్యానర్ శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పొంగల్ బ్లాక్ బస్టర్ ‘సంక్రాంతికి వస్తున్నాం’. దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని గ్రాండ్ గా నిర్మించారు. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటించారు. సెన్సేషనల్ కంపోజర్ భీమ్స్ సిసిరోలియో చార్ట్ బస్టర్ మ్యూజిక్ ఇచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అందరినీ అద్భుతంగా అలరించి, రికార్డ్ బ్రేకింగ్ హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో పొంగల్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ నేపధ్యంలో డిస్ట్రిబ్యూటర్స్ గ్రాటిట్యూడ్ మీట్ నిర్వహించారు.

ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి సంక్రాంతికి వస్తున్నాం సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. అనిల్ ఏమన్నారో ఆయన మాటల్లోనే.. “అందరికీ నమస్కారం. ఆడియన్స్ లేకపోతే ఈ విజయాన్ని మేము ఊహించలేము. ఎర్లీ మార్నింగ్ షోస్ కి ఫ్యామిలీస్ తో కలిసి సినిమా చూశారంటే మామూలు విషయం కాదు. ఇలాంటి అద్భుతాలు చూస్తూ ఎంజాయ్ చేయడమే.”

“నా కెరీర్‌లో ఇది ఒక మిరాకిల్. ఈ విజయాన్ని ఆస్వాదిస్తున్నాను. ఈ సినిమా సక్సెస్ లో మేజర్ క్రెడిట్ వెంకటేష్ గారికి దక్కుతుంది. ఆయన సపోర్ట్ ని మర్చిపోలేను. మీనాక్షి చౌదరి ఐశ్వర్య కూడా చాలా అద్భుతంగా పెర్ఫామ్ చేయడంతో పాటు ప్రమోషన్స్ లో కూడా చాలా హెల్ప్ చేశారు. సినిమా టీమ్ అందరికీ పేరుపేరునా థాంక్యూ నిర్మాత హ్యాపీగా ఉండాలనే టార్గెట్ పెట్టుకుని సినిమాను తీస్తుంటాను.”

“ఇప్పటివరకు ఎనిమిది సినిమాలు చేస్తే ఆరు సినిమాలు రాజు గారితో చేశాను. ఎస్విసి బ్యానర్ ఎన్నో గొప్ప సినిమాలు తీసిన బ్యానర్. ఆ బ్యానర్ కొన్ని జనరేషన్స్ ఉండాలి, ఉంటుంది. డిస్ట్రిబ్యూటర్స్ ఈవెంట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. డిస్ట్రిబ్యూటర్స్ కి వచ్చిన నెంబర్స్ అన్ని చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈ సంవత్సరం సంక్రాంతి డిస్ట్రిబ్యూటర్స్ కి మెమరబుల్ అయింది. ఈ సినిమా ద్వారా నేనెప్పుడూ వినలేను, చూడలేనేమో అనుకునే రెండు జరిగాయి.”

“ఆరు రోజుల్లో 100 కోట్లు షేర్ కొట్టింది. రీజనల్ ఫిలింకి చూడలేనేమో అనుకున్న 300 గ్రాస్ నెంబర్ చూడబోతున్నాను. చాలా హ్యాపీగా ఉంది. నెక్స్ట్ చేయబోయే సినిమాలకు చాలా బాధ్యత పెరిగింది. మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఎప్పుడూ ముందు వుంటాను. ఈసారి డిస్ట్రిబ్యూటర్స్ తో వేడుక జరిగింది నెక్స్ట్ ఎగ్జిబిటర్స్ తో కూడా ఒక ఈవెంట్ చాలా గ్రాండ్ గా నిర్వహించి సంక్రాంతికి వస్తున్నాం సక్సెస్ షీల్డ్స్ ని అందరికీ ఇవ్వాలని భావిస్తున్నాం. అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు” అని తెలిపారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.