విక్టరీ వెంకటేష్, బ్లాక్ బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి, మోస్ట్ సక్సెస్‌ఫుల్ బ్యానర్ శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ కాంబోలో వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఈ పొంగల్‌కి అతిపెద్ద బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్‌గా నటించగా.. రాజేంద్రప్రసాద్, నరేష్ విజయకృష్ణ, మురళీధర్ గౌడ్, వీటీవీ గణేష్, ఉపేంద్ర లిమాయో, సాయికుమార్ తదితరులు కీలక పాత్రల్లో మెరిశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సెన్సేషనల్ కంపోజర్ భీమ్స్ సిసిరోలియో చార్ట్ బస్టర్ మ్యూజిక్ ఇచ్చారు. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సమర్పణలో శిరీష్ గ్రాండ్‌గా నిర్మించిన ఈ చిత్రం భారీ అంచనాల మధ్య జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అందరినీ అద్భుతంగా అలరించి, విడుదలైన అన్నిచోట్లా రికార్డ్ బ్రేకింగ్ హౌస్ ఫుల్ కలెక్షన్స్‌తో సంచలన విజయాన్ని అందుకుని సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది.
ఈ నేపథ్యంలో తాజాగా సంక్రాంతికి వస్తున్నాం అద్భుతమైన రికార్డ్ అందుకుంది. వరల్డ్‌వైడ్‌గా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఇప్పటివరకు మొత్తం 303 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది. అంతేకాకుండా వెంకటేష్, అనిల్ రావిపూడి కెరీర్‌లో తొలిసారి 300 కోట్ల క్లబ్ లోకి ఎంటరైన చిత్రంగా సూపర్ రికార్డ్ సృష్టించింది. ఈ మేరకు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























