విక్టరీ వెంకటేష్, బ్లాక్ బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి, మోస్ట్ సక్సెస్ ఫుల్ బ్యానర్ శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పొంగల్ బ్లాక్ బస్టర్ ‘సంక్రాంతికి వస్తున్నాం’. దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని గ్రాండ్ గా నిర్మించారు. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటించారు. సెన్సేషనల్ కంపోజర్ భీమ్స్ సిసిరోలియో చార్ట్ బస్టర్ మ్యూజిక్ ఇచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అందరినీ అద్భుతంగా అలరించి, రికార్డ్ బ్రేకింగ్ హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో పొంగల్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ నేపధ్యంలో డిస్ట్రిబ్యూటర్స్ గ్రాటిట్యూడ్ మీట్ నిర్వహించారు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత దిల్ రాజు సంక్రాంతికి వస్తున్నాం యూనిట్ కి థాంక్స్ చెప్పారు. దిల్ రాజు ఏమన్నారో ఆయన మాటల్లోనే.. “డిస్ట్రిబ్యూటర్స్ గ్రాటిట్యూడ్ మీట్ పెడతామని చెప్పగానే చాలా ఆనందంగా అనిపించింది. సాధారణంగా డిస్ట్రిబ్యూటర్స్ కి బ్రేక్ ఈవెన్ అయితేనే సూపర్ హిట్ అని చెప్పుకునే పరిస్థితి నెలకొంది. వాళ్ళు నష్టపోయినప్పుడు కూడా సినిమా సూపర్ హిట్ పోస్టర్స్ పడుతుంటాయి.”
“కల్చర్ మారిపోయింది. 90% ఫెయిల్యూర్స్ ఉండే ఇండస్ట్రీ ఇది. జస్ట్ 10% మాత్రమే సక్సెస్. మా డిస్ట్రిబ్యూటర్స్ సక్సెస్ ఫెయిల్యూర్స్ అన్నిటిని తట్టుకుని మాతో జర్నీ కంటిన్యూ చేస్తున్నారు. 20 ఏళ్ల పాటు ఒక ప్రొడ్యూసర్ తో డిస్ట్రిబ్యూటర్స్ కంటిన్యూ అవ్వడం అనేది ఇండస్ట్రీలో చాలా ఆరుదు. డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ థాంక్యూ. బడ్జెట్ కాదు, కథలే ఇంపార్టెంట్. మేము కూడా కథలని నమ్ముకుని సినిమాలు నిర్మించాం.”
“కొత్త దర్శకులతో తీసినప్పుడు ఎన్ని సక్సెస్ లు క్లాసిక్ లు వచ్చాయో అందరికి తెలిసిందే. మేము కూడా కాంబినేషన్స్ అని గత నాలుగు ఐదు ఏళ్ళుగా తడబడుతున్నాం. అనిల్ మళ్ళీ మాకు రూటు చూపించారు. సంక్రాంతికి వస్తున్నాం సెన్సేషనల్ హిట్. ఈ సక్సెస్ తో ఒక రహదారి వేసి ఇచ్చాడు. మా సంస్థ నుంచి అద్భుతమైన సినిమాలు రావడానికి ఇది మాకు ఒక బిగ్ ఎనర్జీ.”
“ఈ సక్సెస్ నాకు కూడా చాలా పాఠాలు నేర్పించింది. అనిల్ తో ఆరు సినిమాలు చేస్తే ఆ 6 విజయవంతం అయ్యాయి. అనిల్ తో సినిమా తీసినప్పుడు నిర్మాతగా ఒత్తిడికి లోనవ్వలేదు. తనతో నాకు చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. ఎక్కడో పడిపోతున్న మమ్మల్ని పైకి తీసుకొచ్చి నిలబెట్టాడు. మళ్ళీ అద్భుతమైన సినిమాలు తీస్తాం. రిజల్ట్స్ 100% వస్తాయి.”
“వెంకటేష్ గారు ప్రొడ్యూసర్ ఫ్రెండ్లీ హీరో. ఆయన నిర్మాతలకు ఇచ్చే గౌరవం మాములుగా ఉండదు. అందుకే అద్భుతంగా ఆయనతో నాలుగు సినిమాలు చేయగలిగాం. ఈ సినిమా ఇంత పెద్ద విజయం అవ్వడానికి కారణమైన వెంకటేష్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మా టీమ్ అందరికీ థాంక్యు వెరీ మచ్” అని అన్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























