అఫీషియల్.. ది ప్యారడైజ్ కోసం అనిరుధ్

Anirudh Ravichander Teams up With Natural Star Nani For The Paradise

నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ (SLV సినిమాస్) నిర్మాత సుధాకర్ చెరుకూరి ‘దసరా’ బ్లాక్ బస్టర్ విజయం తర్వాత ‘ది ప్యారడైజ్’ కోసం కొలాబరేట్ అయ్యారు. ఈ కొత్త చిత్రం త్వరలో ప్రారంభం కానుంది. ప్రీ-ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి. నాని కూడా తన పాత్ర కోసం సిద్ధం కావడానికి ఇంటెన్స్ గా జిమ్‌ చేస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందించడం ఖాయమైయింది. అయితే నాని, అనిరుధ్ కలిసి పనిచేస్తున్న మూడవ చిత్రం ఇది. ఇంతకుముందు నాని-అనిరుధ్ కాంబోలో వచ్చిన జెర్సీ, గ్యాంగ్‌ లీడర్ సినిమాలు వచ్చాయి. ఈ రెండు సినిమాలు మ్యూజికల్ హిట్స్ గా నిలిచాయి. ఈ నేపథ్యంలో మరోసారి వీరి కాంబో మరోసారి రిపీట్ అవుతుండటంతో ఈ అప్ కమింగ్ ప్రాజెక్ట్ పై అంచనాలు భారీగా వున్నాయి.

ఈ సందర్భంగా “మేము మా హ్యాట్రిక్ పై ఉన్నాము: ఇది ఒక అద్భుతం అవుతుంది. ఇప్పుడు నాని-ఓదెల సినిమా ది ప్యారడైజ్ కు స్వాగతం, డియర్ అనిరుధ్ లవ్ యూ.. అని హీరో నాని పోస్ట్ చేశారు. ఇక దీనికి స్పందిస్తూ.. “ఇది చాలా స్పెషల్. మై డియర్ నాని, శ్రీకాంత్ ఓదెల.. వెర్రిగా పోదాం” అని అనిరుధ్ పోస్ట్ చేశారు.

ఇక శ్రీకాంత్ ఓదెల పవర్ ఫుల్ లార్జర్ దెన్ లైఫ్ కథను ఇంటెన్స్ స్క్రీన్‌ప్లేతో రూపొందించారు. ఇది నానిని పూర్తిగా కొత్త, మాస్-డ్రైవ్ అవతార్‌లో ప్రజెంట్ చేయనుంది. కాగా ఈ చిత్రం ఇప్పటివరకు నాని యొక్క మోస్ట్ హై బడ్జెట్ వెంచర్‌ కావడం గమనార్హం. నిర్మాత సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని గ్రాండ్ స్కేల్ లో నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో నటించనున్న మిగిలిన నటీనటులు, పనిచేయనున్న సాంకేతిక నిపుణుల వివరాలను మేకర్స్ త్వరలోనే తెలియజేయనున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.