ఇండియన్ సినిమాకి ఆయన కాంట్రిబ్యూషన్ వెలకట్టలేనిది

Thandel Hindi Trailer Launch Event Devi Sri Prasad Praises Actor Aamir Khan

యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘తండేల్’. చందూ మొండేటి దర్శకత్వంలో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో గీతాఆర్ట్స్ బ్యానర్‌పై ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్ బన్నీవాసు నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల కానుంది. ఇప్పటికే రిలీజైన ప్రమోషన్స్ కంటెంట్ హ్యుజ్ బజ్‌ని క్రియేట్ చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ ఈ మూవీ హిందీ ట్రైల‌ర్‌ను ముంబైలో లాంచ్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సందర్భంగా రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ.. “అందరికీ గుడ్ ఈవెనింగ్. అమీర్ సార్ వి లవ్ యు. తండేల్ సినిమాకి అమీర్ ఖాన్ గారు సపోర్ట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఆయన్ని కలవడం గర్వంగా ఉంది. ఇండియన్ సినిమాకి ఆయన కాంట్రిబ్యూషన్ వెలకట్టలేనిది. ముంబై ఆడియన్స్ నా పాటలకు ఎప్పుడు కూడా చాలా గ్రేట్ రెస్పాన్స్ ఇచ్చారు. అల్లు అరవింద్ గారికి థాంక్యూ. గీత ఆర్ట్స్ అద్భుతమైన చిత్రాలని నిర్మిస్తుంది.” అని తెలిపారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ.. “తండేల్‌ని కూడా చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు. ఇది చాలా గ్రేట్ జర్నీ. డైరెక్టర్ చందు చాలా అద్భుతమైన కథను రాశారు. సినిమాని హార్ట్ టచింగ్‌గా తీశారు. నాగచైతన్య ఫెంటాస్టిక్‌గా పెర్ఫార్మ్ చేశారు. ఈ క్యారెక్టర్ కోసం ఆయన బీస్ట్ మోడ్ లోకి ట్రాన్స్‌ఫర్ అయ్యారు. సాయిపల్లవి మార్వలెస్‌గా యాక్ట్ చేసింది. వారి కెమిస్ట్రీ మీ అందరిని ఆకట్టుకుంటుంది. లిరిక్ రైటర్స్‌కి, టెక్నీషియన్స్‌కి, మ్యూజిషియన్స్‌కి అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. తప్పకుండా మీ అందరికీ ఈ సినిమా నచ్చుతుంది” అని పేర్కొన్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.