సాయి ప‌ల్ల‌వి పేరు చెబితే చాలు

Rockstar Devi Sri Prasad Says, He is Big Fan of Sai Pallavi Dance

యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, స్టార్ హీరోయిన్ సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం ‘తండేల్’. ‘కార్తికేయ-2’ లాంటి బంపర్ హిట్ కొట్టిన డైరెక్టర్ చందూ మొండేటి దర్శకత్వంలో సక్సెస్‌ఫుల్ మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో గీతాఆర్ట్స్ బ్యానర్‌పై ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్ బన్నీవాసు నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల కానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్‌ ఇప్పటికే ప్రమోషన్స్ ఓ రేంజ్‌లో చేస్తుంది. తాజాగా గురువారం ఈ మూవీ త‌మిళ ట్రైల‌ర్‌ను చెన్నైలో విడుద‌ల చేశారు. కోలీవుడ్ స్టార్ కార్తి ముఖ్య అతిథిగా హాజ‌రై ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు. ఇంకా ఈ కార్య‌క్ర‌మంంలో డైరెక్ట‌ర్స్ కార్తీక్ సుబ్బ‌రాజ్‌, వెంక‌ట్ ప్ర‌భు స‌హా చిత్ర యూనిట్ పాల్గొన్నారు. ఇక ఈ చిత్రాన్ని త‌మిళంలో డ్రీమ్ వారియ‌ర్ పిక్చ‌ర్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తోంది.

ఈ సంద‌ర్బంగా మ్యూజిక్ డైరెక్ట‌ర్ రాక్‌స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్ మాట్లాడుతూ “తండేల్‌ సినిమాను డైరెక్ట‌ర్ చందూ మొండేటిగారు, నిర్మాత బ‌న్నీవాసుగారు వ‌న్ లైన‌ర్స్‌గా చెప్పిన‌ప్పుడు ఎంత‌గానో న‌చ్చేసింది. ఓ ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యింది. అది సినిమా అంతా కొనసాగుతూ వ‌చ్చింది. ఈ జ‌ర్నీని నేను ఎంతో ఎంజాయ్ చేశాను.” అని చెప్పారు.

“అల్లు అర‌వింద్‌ గారికి నేను చిన్న‌ప్ప‌టి నుంచే తెలుసు. చాలా మంచి వ్య‌క్తి. ఆయ‌న‌కు స్పెష‌ల్ థాంక్స్‌. చైత‌న్య నాకు చాలా మంచి స్నేహితుడు. ఈ సినిమా కోసం త‌ను పూర్తిగా మారారు. త‌న పోస్ట‌ర్‌ను ముందుగా చూసిన‌ప్పుడు ఇది నాకు తెలిసిన చైత‌న్య కాదే అనిపించింది. చాలా క‌ష్ట‌ప‌డ్డారు. సాయి ప‌ల్ల‌వి పేరు చెబితే చాలు. అద్భుతంగా న‌టించింది. ఆమె డాన్స్‌కు నేను పెద్ద అభిమానిని.” అని తెలిపారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ.. “విజువ‌ల్స్ చాలా గొప్ప‌గా ఉన్నాయి. చ‌క్క‌టి క‌థ‌. ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా వ‌చ్చిన కార్తిగారికి థాంక్స్‌. వెంక‌ట్ ప్ర‌భు, కార్తీక్ సుబ్బ‌రాజ్‌గారికి థాంక్స్‌. వివేకన్‌గారు అద్భుత‌మైన లిరిక్స్‌ను అందించారు. ట్యూన్స్‌కు ఆయ‌న త‌న సాహిత్యంతో ప్రాణం పోశారు. తండేల్ చిత్ర యూనిట్‌కు స్పెష‌ల్ థాంక్స్‌. సినిమాను ఫిబ్ర‌వ‌రి 7న థియేట‌ర్స్‌లో చూసి ఎంజాయ్ చేయండి’’ అని కోరారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.