అమీర్ ఖాన్ చేతులమీదుగా.. తండేల్ హిందీ ట్రైలర్‌ లాంచ్

Thandel Hindi Trailer Launched by Bollywood Star Aamir Khan in Mumbai

యువ సామ్రాట్ నాగ చైతన్య లేటెస్ట్ మ్యూజికల్ లవ్ ఎంటర్‌టైనర్ ‘తండేల్’తో మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఫిబ్రవరి 7న ఈ సినిమా తెలుగుతోపాటు తమిళ, హిందీ భాషల్లో థియేటర్లలోకి రానుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్ ముమ్మురం చేశారు మేకర్స్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దీనిలో భాగంగా ఇప్పటికే రిలీజైన మూడు పాటలు చార్ట్ బస్టర్ అనిపించుకోగా.. రీసెంట్‌గా ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్ ఇటీవలే విడుదలై సినిమాపై అంచనాలను బాగా పెంచేసింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం నుంచి అభిమానులకు మరో సర్ ప్రైజ్ అందించింది చిత్ర యూనిట్. ఈరోజు తండేల్ హిందీ ట్రైలర్‌ను లాంచ్ చేసింది.

ముంబైలో గ్రాండ్‌గా జరిగిన ఈ ఈవెంట్‌లో బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన చేతులమీదుగా హిందీ ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఇంతకుముందు అమీర్ ఖాన్ ”లాల్ సింగ్ చద్దా’ చిత్రంలో చైతూ ఓ కీలక పాత్రను పోషించిన విషయం తెలిసిందే. ఆ పరిచయంతోనే నేడు తండేల్ హిందీ ట్రైలర్‌ను లాంచ్ చేయడానికి అమీర్ వచ్చారు.

ఇక ఇప్పటికే తండేల్ సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. సెన్సార్ బోర్డు ఈ సినిమాకు యు/ఏ సర్టిఫికెట్ అందించింది. మేకర్స్ సినిమాకు పర్ఫెక్ట్ రన్ టైమ్‌ను సెట్ చేశారు. టైటిల్ కార్డ్, క్రెడిట్స్ అన్నీ కలుపుకొని మొత్తం 2గంటల 32 నిమిషాల నిడివితో తండేల్ థియేటర్లలోకి రానుంది.

కాగా యూఎస్ఏ లో ఈ సినిమా 596కు పైగా లొకేషన్లలో విడుదలకానుంది. చైతన్య కెరీర్‌లో ఇదే బిగ్గెస్ట్ రిలీజ్. సోలోగా రిలీజ్ అవ్వడం తండేల్‌కు మంచి అడ్వాంటేజ్ కానుంది. దీంతో తండేల్ సినిమా నాగ చైతన్య కెరీర్‌లో నెవెర్ బిఫోర్ ఓపెనింగ్స్‌ను రాబట్టుకోనుందని సినీ పండితులు అంచనా వేస్తున్నారు.

ఇక తండేల్ మూవీకి టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. నేషనల్ అవార్డ్ విన్నింగ్ కంపోజర్ ‘రాక్‌స్టార్’ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో సాయి పల్లవి కథానాయికగా నటించింది. నేషనల్ అవార్డ్ విన్నర్ నవీన్ నూలి ఎడిటర్‌. అలాగే షామ్‌దత్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా.. శ్రీనాగేంద్ర తంగాల ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు.

క్రియేటివ్ డైరెక్టర్ చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో ప్రతిష్టాత్మక గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాసు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా డి.మత్స్యలేశం గ్రామంలో జరిగిన నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ సినిమాను రూపొందుతోంది. చైతూ తన కెరీర్‌లో తొలిసారి లార్జర్ దేన్ లైఫ్ క్యారక్టర్ పోషిస్తుండటంతో ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.