సీనియర్ హీరో బాలకృష్ణ డాకు మహారాజ్ థియేటర్లలో స్ట్రాంగ్ హోల్డ్ కొనసాగిస్తూ సూపర్ వసూళ్లను రాబట్టుకుంటుంది. 4రోజుల్లోనే 100కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ సినిమా సాలిడ్ వసూళ్లను సొంతం చేసుకుంది. దాంతో ప్రపంచ వ్యాప్తంగా 5 రోజుల్లో 114కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టినట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక తొలి 10రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా 165 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
బ్రేక్ ఈవెన్ టార్గెట్ 80కోట్ల షేర్ కాగా, విడుదలైన అన్ని ఏరియాల్లో టార్గెట్‌ను పూర్తి చేసి లాభాల్లోకి వచేసింది. అంతేకాకుండా ‘భగవంత్ కేసరి’ లైఫ్ టైం కలెక్షన్స్‌ను క్రాస్ చేసేసింది. తద్వారా బాలయ్య కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా డాకు మహారాజ్ రికార్డ్ సృష్టించింది. ఇక ఫుల్ రన్‌లో 150కోట్ల మార్క్‌ను క్రాస్ చేయనుంది. ఈ క్రమంలో ఈ సినిమాతో బాలకృష్ణ వరసగా నాలుగో విజయాన్ని ఖాతాలో వేసుకున్నట్టయింది.
అయితే డాకు మహారాజ్‌కు బాక్సాఫీస్ వద్ద ‘సంక్రాంతికి వస్తున్నాం’తో గట్టి పోటీ ఎదురువుతోంది. బాబీ తెరకెక్కించిన ఈ సినిమాలో శ్రద్దా శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్, ఊర్వశి రౌతేలా కీలక పాత్రల్లో కనిపించగా బాబీ డియోల్ విలన్ పాత్రలో నటించాడు. తమన్ సంగీతం అందించాడు. సితార ఎంటర్టైన్మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సాయి సౌజన్య, నాగవంశీ ఈ సినిమాను నిర్మించారు.
ఇక బాలకృష్ణ ప్రస్తుతం అఖండ సీక్వెల్ అఖండ 2లో నటిస్తున్నాడు. బోయపాటి శ్రీనివాస్ తెరకెక్కిస్తుండగా తమన్ సంగీతం అందిస్తున్నాడు. 14 రీల్స్ ప్లస్ ఈసినిమాను నిర్మిస్తుంది. దసరాకు విడుదలకానుంది. ఇంతకుముందు బాలయ్య-బోయపాటి కాంబోలో వచ్చిన మూడు చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి హ్యాట్రిక్ కొట్టడంతో.. ఈ సినిమాపై భారీ అంచనాలు వున్నాయి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























