గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌కు కృతజ్ఞతలు తెలిపింది ‘కన్నప్ప’ టీమ్. కాగా ఈ ప్రెస్టీజియస్ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 25న భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. కాగా ప్రస్తుతం ఈ పాన్-ఇండియా ప్రాజెక్ట్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతుండగా సినిమా ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టేశారు మేకర్స్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
దీనిలో భాగంగా హీరో విష్ణు మంచు మరియు ఆయన తండ్రి సీనియర్ నటుడు మోహన్ బాబు ప్రస్తుతం దేశవ్యాప్తంగా ద్వాదశ జ్యోతిర్లింగాలను సందర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా వీరు గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్‌ను కలుసుకున్నారు. వీరివెంట చిత్రంలో నటిస్తున్న శరత్ కుమార్, ముఖేష్ రిషి, వినయ్ మహేశ్వరి కూడా ఉన్నారు. ప్రముఖ తెలుగు కళాకారుడు రమేష్ గొరిజాల కుంచె నుంచి జాలువారిన అద్భుత పెయింటింగ్‌ను విష్ణు సీఎం భూపేంద్రకి బహుకరించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ చూపిన అతిథి మర్యాదలకు ‘కన్నప్ప’ టీం హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపింది. ఈ మేరకు మోహన్ బాబు ఎక్స్ వేదికగా.. “విష్ణు మంచు, శరత్ కుమార్, ముఖేష్ రిషి మరియు వినయ్ మహేశ్వరితో పాటు గౌరవనీయులైన గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర పటేల్ జీని కలవడం చాలా ఆనందంగా ఉంది.” అని పేర్కొన్నారు.
“నేను అతనికి మంచి ఆదరణ ఇచ్చినందుకు ధన్యవాదాలు మరియు అతని మంచి ఆరోగ్యం మరియు శ్రేయస్సు కోసం సర్వశక్తిమంతుడిని స్తుతిస్తున్నాను. శ్రేయస్సు యొక్క చిహ్నంగా, విష్ణు అతనికి ప్రఖ్యాత తెలుగు కళాకారుడు రమేష్ గొరిజాల పెయింటింగ్‌ను బహుమతిగా ఇచ్చాడు. గుజరాత్ పురోగతిని నడిపించే డైనమిక్ లీడర్‌గా ఆయన విజయాన్ని కొనసాగించాలి” అని మోహన్ బాబు ఆకాంక్షించారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























