హరి హర వీరమల్లు రిలీజ్ డేట్ మారలేదు

Hari hara Veera Mallu release date remains unchanged

బ్రో తరువాత పవర్ స్టార్ పవన్ పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు తో ప్రేక్షకులను పలకరించనున్నాడు.పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో రెండు భాగాలుగా వస్తున్న సినిమా ఇది.షూటింగ్ కూడా పూర్తి కావొచ్చింది.పవన్ డేట్స్ ఇస్తే వచ్చే నెలలో బ్యాలెన్స్ షూట్ పూర్తి కానుంది.ఫస్ట్ పార్ట్ స్వోర్డ్ వెర్సెస్ స్పిరిట్ ను మార్చి 28న రిలీజ్ చేయనున్నారు.అయితే రీసెంట్ గా అదే డేట్ కు నితిన్ రాబిన్ హుడ్ అలాగే 29న మ్యాడ్ స్క్వేర్ విడుదలను ప్రకటించాయి.దాంతో హరి హర వీరమల్లు వాయిదా పడనుందని అందుకే ఈ రెండు సినిమాలు ఆ టైంలో వస్తున్నాయని వార్తలు వచ్చాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కానీ ఈరోజు రిలీజ్ డేట్ మారలేదని హరిహర వీరమల్లు మేకర్స్ ప్రకటించారు. ఈసినిమా లో బాబీ డియోల్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు.ఇక ఈరోజు తన బర్త్ డే సందర్బంగా ఈసినిమా నుండి బాబీ డియోల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.ఇందులో మార్చి 28నే రిలీజ్ అంటూ వేశారు.సో ఈసినిమా అదే డేట్ కు రానుంది.మరి రాబిన్ హుడ్ ,మ్యాడ్ స్క్వేర్ రిలీజ్ డేట్ లను మార్చుకుంటాయో లేక చెప్పిన డేట్లకే వచ్చి రిస్క్ చేస్తాయో చూడాలి.

హరిహర వీరమల్లును సగానికి పైగా క్రిష్ డైరెక్ట్ చేయగా మిగితా భాగం జ్యోతి కృష్ణ డైరెక్ట్ చేస్తున్నారు.ఇందులో నిధి అగర్వాల్ ,నోరా ఫతేహి కీలక పాత్రల్లో నటిస్తుండగా ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. ఈసినిమాను మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ లో దాదాపు 100కోట్లకు పైగా బడ్జెట్ తో ప్రముఖ నిర్మాత ఏఏం రత్నం నిర్మిస్తుండగా పాన్ ఇండియా మూవీ గా విడుదలకానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.