సూపర్ స్టార్ మహేష్ బాబు – అగ్ర దర్శకుడు రాజమౌళి కాంబినేషన్ లో సినిమా రానుందని తెలిసిందే. ఏడాది నుండి ఈసినిమాకు సంబంధించిన వర్క్ షాప్ జరుగుతుంది కానీ ఇప్పటివరకు అఫీషియల్ గా సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. అయితే నిన్న రాజమౌళి ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ వేసి సినిమా గురించి హింట్ ఇచ్చాడు.నిన్న తన ఇంస్టా లో ఓ వీడియో పోస్ట్ చేశాడు రాజమౌళి.అందులో రాజమౌళి సింహంను బందిస్తున్నట్లు అలాగే చేతిలో పాస్ పోర్ట్ తో నవ్వుతూ కనిపించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
దాంతో ఈ పోస్ట్ సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతుంది.మహేష్ బాబు హాలీడేకు విదేశాలకు వెళ్లకుండా రాజమౌళి తన పాస్ పోర్ట్ లాగేసుకున్నాడని త్వరలో సినిమా స్టార్ట్ కానుందని మహేష్ ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు.ఇక ఈ పోస్ట్ కి మహేష్ కామెంట్ చేశారు.ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను అంటూ కామెంట్ పెట్టాడు. ప్రియాంక చోప్రా కూడా ఫైనల్ గా స్టార్ట్ అవుతుందని అర్ధం వచ్చేలా కామెంట్ పెట్టింది.ఈనెలలోనే ఈసినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.
ఇక ఈసినిమా కోసం ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటించనుందని రీసెంట్ గా వార్తలు రాగ ఇక ఇప్పుడు ప్రియాంక స్పందించడంతో అవి నిజమే అని తేలిపోయాయి.అడ్వెంచర్ బ్యాక్ డ్రాప్ లో భారీ బడ్జెట్ తో రానుంది ఈసినిమా.ఈ ఏడాది లోనే షూటింగ్ పూర్తి చేయాలని చూస్తున్నాడు రాజమౌళి.ఆతర్వాత విఎఫ్ఎక్స్ కి ఎక్కువ సమయం కేటాయించనున్నారు.ఈసినిమా 3000 కోట్ల మార్క్ ను టచ్ చేయడం ఖాయంగా కనిపిస్తుంది.దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ ఈసినిమాను నిర్మించనుండగా ఇందులో పలువురు హాలీవుడ్ నటీనటులు కూడా యాక్ట్ చేయనున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























