టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి పనిచేయాలనుందని, తనతో ఒక సినిమా చేయాలనుందని మనసులో మాట వెలిబుచ్చారు ‘సూపర్ మేన్’ సినిమా ఫేమ్, ప్రముఖ హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ గన్. దర్శకధీరుడు ఎస్ఎస్. రాజమౌళి నిర్మించిన ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రంలో జూనియర్ నటనకు ముగ్ధుడనయ్యానని, అప్పుడే ఆయనతో ఓ సినిమా చేయాలనే ఆలోచనకు వచ్చినట్లు జేమ్స్ తెలిపారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. “ఆర్‌ఆర్‌ఆర్ లో నటించిన ఆ కుర్రాడు ఎవరు? అనే విషయం ఏడాదిగా నా మదిని తొలిచేస్తోంది. ఆ యంగ్ చార్మ్ చాలా బాగున్నాడు. పులులతో వీరోచిత పోరాటం, ఇంకా తను నటించిన ప్రతీ సన్నివేశం ఎంతో అద్భుతంగా ఉంది. ఆయనతో కలసి పనిచేయడానికి ఇష్టపడుతున్నాను” అని పేర్కొన్నారు.
అయితే ఎన్టీఆర్ తో సినిమా కోసం కోసం మీ వద్ద ప్రత్యేక పాత్ర ఏమైనా సిద్ధంగా ఉందా? అన్న ప్రశ్నకు జేమ్స్ గన్ సమాధానమిస్తూ.. ప్రస్తుతానికైతే లేదు. అందుకు కొంత సమయం పడుతుందని బదులిచ్చారు. ఇక, ఇదే ఇంటర్వ్యూలో పాల్గొన్న మరో ప్రముఖ హాలీవుడ్ డైరెక్టర్ ఆండ్రూ గార్‌ఫీల్డ్ కూడా ‘ఆర్‌ఆర్‌ఆర్’ లో రామ్ చరణ్, ఎన్టీఆర్ నటనను ప్రశంసలతో ముంచెత్తారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























