త్రిష, టోవినో థామస్ ఐడెంటిటీ ట్రైలర్ లాంచ్

Trisha and Tovino Thomas' Identity Telugu Trailer Launched

అఖిల్ పాల్, అనాస్ ఖాన్ రచన దర్శకత్వంలో రాజు మల్లియాత్, రాయ్ సిజె నిర్మాతలుగా టోవినో థామస్, త్రిష ప్రధాన పాత్రలు పోషిస్తూ వినయ్ రాయ్, మందిర బేడి తదితరులు కీలకపాత్ర పోషిస్తూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘ఐడెంటిటీ’. మలయాళంలో విడుదలైన ఈ చిత్రం రెండు వారాలలో 50 కోట్లకు పైగా వసూలు చేసి 2025 లో తొలి హిట్ సినిమాగా నిలిచింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

జేక్స్ బెజోయ్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించగా అఖిల్ జార్జ్ సినిమాటోగ్రఫీ చేశారు. ఈ చిత్రానికి చామన్ చక్కో ఎడిటింగ్ చేశారు. ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు అత్యంత చేరువుగా మూవీ మాక్స్ శ్రీనివాస్ మామిడాల సమర్పణలో శ్రీ వేదాక్షర మూవీస్ చింతపల్లి రామారావు గారు కలిసి ఈ చిత్రం తెలుగు రాష్ట్రాలలో విడుదల చేయనున్నారు.

కాగా ఈ చిత్రానికి పేరొందిన సాంకేతిక నిపుణుల బృందం పనిచేస్తోంది. అఖిల్ జార్జ్ సినిమాటోగ్రఫీ, చామన్ చక్కో ఎడిటింగ్ అందిస్తుండగా.. సంగీతం జేక్స్ బెజోయ్ సమకూరుస్తున్నారు. ఈ నెల 24వ తేదిన తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో నేడు హైదరాబాదులో చిత్ర యూనిట్ సమక్షంలో ఈ చిత్ర తెలుగు టైలర్ లాంచ్ చేయడం జరిగింది.

ఈ సందర్భంగా మామిడాల శ్రీనివాస్ మాట్లాడుతూ… “ఐడెంటిటీ చిత్ర ట్రైలర్ లంచ్ కు వచ్చిన అందరికీ ధన్యవాదాలు. ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకు రావాలి అనే ఉద్దేశంతో తీసుకొచ్చాము. ఈ చిత్రం మలయాళంలో జనవరి 2వ తేదీన విడుదలై ఇప్పటికే 40 కోట్లకు పైగా వసూలు చేసింది. సంక్రాంతి సమయానికి ఇక్కడ సినిమాలు ఉండటంవల్ల అదే సమయంలో విడుదల చేయలేకపోయాము. “

“అందుకే ఈనెల 24వ తేదీన విడుదల చేస్తున్నాము. ఈ చిత్రంలో మన తెలుగువారి కొడుకుని యాక్షన్ కంటెంట్ చాలా బాగుంటుంది. ఇప్పటికే ఈ చిత్రం మలయాళంలో బాగా ప్రేక్షకుల మరణ పొందడంతో తెలుగులో కూడా ఈ చిత్రం అలాగే ఉంటుందని ఎన్నో అంచనాలు ఉన్నాయి.”

“అయితే అనుకోని కారణాలవల్ల హీరో టోవినో థామస్, హీరోయిన్ త్రిష ఈ వేడుకకు రాలేకపోయారు. దర్శకులు ఎంతో జాగ్రత్తగా ఈ చిత్రాన్ని రూపొందించినట్లు అర్థమవుతుంది. ఈ చిత్రం కచ్చితంగా మంచి విజయం సాధిస్తుందని కోరుకుంటున్నాను. దర్శకులు ఈ కార్యక్రమానికి రావడం ఎంతో సంతోషకరంగా ఉంది” అని అన్నారు.

చింతపల్లి రామారావు గారు మాట్లాడుతూ… “ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీడియా వారికి, స్నేహితులకి, సన్నిహితులకి అందరికీ పేరుపేరునా నా కృతజ్ఞతలు. ఈ నూతన సంవత్సరంలో సంచలన వసూలతో గొప్ప విజయం సాధించింది ఐడెంటిటీ సినిమా. మామిడాల శ్రీనివాసరావు గారితో కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నాము.”

“ఇది మలయాళ చిత్రం అయినప్పటికీ ఈ చిత్రంలో నటించిన వారు అలాగే ఈ సినిమాకు పనిచేసినవారు తెలుగునాట అందరికీ సుపరిచితులు కావడం విశేషం. ఈ చిత్రం ద్వారా దర్శకులకు తెలుగులో మంచి గుర్తింపు వస్తుందని కోరుకుంటున్నాము. జనవరి 24వ తేదీన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులు ముందుకు రానుంది. యాక్షన్ త్రిలరైనటువంటి ఈ చిత్రం ప్రేక్షకులను కచ్చితంగా వినోదపరుస్తుందని కోరుకుంటున్నాను” అని అన్నారు.

అఖిల్ పాల్ మాట్లాడుతూ… “ముందుగా మీడియా వారందరికీ నా ధన్యవాదాలు. ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడానికి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. ఈ సినిమా మొదలైనప్పటికి నుండి సుమారు రెండు మూడు సంవత్సరాలుగా నాతో ప్రయాణం చేస్తున్న చిత్ర కథానాయకుడు టోవినో థామస్.”

“చిత్ర నిర్మాతలతో కలిసి ఆయన కూడా ఈ సినిమా కోసం నిలబడ్డారు. మలయాళం సినిమా బడ్జెట్ తో పోలిస్తే ఈ చిత్రం బడ్జెట్ కొంచెం ఎక్కువగానే అయింది. ఈ చిత్రం ఎంతోమంది ప్రముఖ నటీనటులు, సాంకేతిక సిబ్బంది ముందుకు వచ్చి పని చేశారు. ఈ చిత్రం మొదలైన సమయంలోనే ఈ చిత్రాన్ని దేశమంతుడు చూపించాలని మేము అనుకున్నాము.”

“అందుకే ముందు నుండి కూడా ఈ సినిమా కోసం చాలా జాగ్రత్తగా పని చేసాము. స్క్రిప్ట్ నుండి యాక్షన్ సీన్స్ వరకు చాలా జాగ్రత్త పడ్డాము. తెలుగు ప్రేక్షకుల ముందుకు ఈ సినిమాని తీసుకురావడానికి ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాను. కేరళలో సాధించినట్లు ఎక్కడ కూడా పెద్ద విజయాన్ని సాధిస్తుందని అనుకుంటున్నాను. ట్రైలర్ ఎంత పవర్ఫుల్‌గా వచ్చింది. అంతే పవర్ ఫుల్‌గా ఈ సినిమా కూడా ఉండబోతుంది” అన్నారు.

నటుడు వినయ్ రాయ్ మాట్లాడుతూ… “అందరికి నమస్కారం. ముందుగా ఇక్కడ టైలర్ చూసి నన్ను ఎంత సపోర్ట్ చేసిన మీడియా వారందరికీ నా ధన్యవాదాలు. రామారావు గారికి, శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు. తెలుగులో ప్రశాంత్ వర్మ నన్ను ప్రేక్షకులందరికీ ఎంతగా గుర్తుండిపోయిన చేశారో మలయాళం లో కూడా అఖిల్ ఆ స్థాయిలో నాకు గుర్తింపు వచ్చేలా చేశారు.”

“నా 18 సంవత్సరాల కెరియర్ లో ఇటువంటి కథను నేను ఎప్పుడు వినలేదు. ఈ చిత్రంలో యాక్షన్, సస్పెన్స్, మంచి స్టోరీ లైన్ ఇలా అన్నీ ఉన్నాయి. ఈ చిత్రం తెలుగువారికి ఎంతో నచ్చుతుందని అనుకుంటున్నాను. తెలుగు నిర్మాతలకు ఈ చిత్రం మంచి బిజినెస్ చేస్తుందని అనుకుంటున్నాను. జనవరి 24వ తేదీన ఈ చట్టం ప్రేక్షకులు ముందుకు రాబోతుంది” అంటూ ముగించారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.