బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్‌పై గుర్తుతెలియని వ్యక్తి దాడి చేసాడు. ముంబైలోని ఆయన నివాసంలోకి చొరబడిన దుండగుడు కత్తితో సైఫ్‌పై దాడికి పాల్పడ్డాడు. గురువారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో ఆయనకు ఆరు చోట్ల గాయాలయ్యాయి. దీంతో కుటుంబ సభ్యులు సైఫ్‌ను హుటాహుటిన లీలావతి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ నేపథ్యంలో టాలీవుడ్ స్తర్బ్ హీరో, యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్పందించారు. సైఫ్ అలీఖాన్‌పై దాడిని ఖండించిన అయన సైఫ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ వార్త తనకు ఎంతో బాధను కలిగించిందని పేర్కొన్న ఎన్టీఆర్.. ఆయన త్వరితగతిన పూర్తి ఆరోగ్యవంతులు కావాలని ఆశాభావం వ్యక్తం చేసారు. అలాగే ఈ దాడి ఘటనపై మెగాస్టార్ చిరంజీవి కూడా స్పందించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా చిరు ట్వీట్ చేశారు.
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ టైటిల్ రోల్‌లో నటించిన ‘దేవర’ సినిమా ప్రపంచవ్యాప్తంగా 500 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సంచలన విజయం అందుకుంది. కొరటాల శివ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్స్ జాన్వీ కపూర్ కథానాయికగా నటించగా.. సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో కనిపించారు.
అలాగే ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, షైన్ టామ్ చాకో, అజయ్, గెటప్ శీను తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ పతాకాలపై మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ.కె ఈ సినిమాను నిర్మించారు. మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























